Sunday, November 16, 2025
Homeఆంధ్రప్రదేశ్Nara Lokesh: సీఎం పదవిపై మంత్రి లోకేశ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

Nara Lokesh: సీఎం పదవిపై మంత్రి లోకేశ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

కడప గడ్డపై టీడీపీ ఆధ్వర్యంలో మహానాడు కార్యక్రమం ఘనంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. మహానాడు వేదికగా టీడీపీ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్(Nara Lokesh)కి కీలక బాధ్యతలు అప్పగిస్తారనే చర్చ సాగుతోంది. ఈ సందర్భంగా మీడియాతో చిట్‍చాట్‌లో మాట్లాడుతూ.. తదుపరి సీఎం మీరే అన్న ప్రశ్నకు లోకేశ్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. ముఖ్యమంత్రి పదవికి అంత తొందరేముంది? అని తెలిపారు. సీఎం చంద్రబాబు ఇంకా యువ నాయకుడే అని అభివర్ణించారు. దేశానికి ప్రధాని మోడీ, రాష్ట్రానికి చంద్రబాబు నాయకత్వం చాలా అవసరమన్నారు.

- Advertisement -

ఇక మహానాడులో లోకేశ్ మాట్లాడుతూ.. పేదరికం లేని సమాజం తెలుగుదేశం పార్టీ లక్ష్యమని తెలిపారు. ఉర్సా సంస్థకు 99 పైసలకు ఎకరా భూమి ఇచ్చినట్టు జగన్‌ నిరూపిస్తే.. రాజీనామాకు తాను సిద్ధమని సవాల్ చేశారు. టీసీఎస్‌కు 99 పైసలకు ఇచ్చామని.. ఉర్సాకు కూడా మార్కెట్ ధరకే భూములు ఇచ్చామన్నారు. విశాఖలో 5లక్షల ఉద్యోగాలు కల్పిస్తే ఇక విశాఖ నగరాన్ని అందుకోలేమన్నారు. మద్యం కుంభకోణంలో జగన్‌ వైఖరి దొంగే.. దొంగ దొంగ అన్నట్టుగా ఉందని ఎద్దేవా చేశారు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad