Saturday, November 23, 2024
Homeఆంధ్రప్రదేశ్Nandikotkuru: దళితుల భూములను దోచుకున్న దళిత ద్రోహి శివానందరెడ్డి

Nandikotkuru: దళితుల భూములను దోచుకున్న దళిత ద్రోహి శివానందరెడ్డి

సంఘవిద్రోహి నయూమ్ తో జతకట్టి వేల కోట్ల ఆస్తులు

టిడిపి నేతలు నీచ స్థాయికి దిగజారి “నియోజకవర్గ అభివృద్ధికి శాంతి కాపోతానికి, నిస్వార్థ ప్రజా సేవకుడుగా సేవలందించిన తమ నేత మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామిపై అసభ్యకరమైన మాటలు మాట్లాడితే సహించేది లేదని మాజీ ఎమ్మెల్యే లబ్బి అనుచరులు మాజీ సర్పంచ్ రమణ , లాయర్ భాస్కర్ లు హెచ్చరించారు. టిడిపి నేతలు మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామిపై చేసిన అసభ్య పదజాల వ్యాఖ్యలను ఖండిస్తూ లబ్బి అనుచరులు మాజీ సర్పంచ్ రమణ, దౌలత్ భాషా ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సర్పంచ్ రమణ మాట్లాడుతూ కొలనుభారతి అమ్మవారికి క్షేత్రంలో మాజీ ఎమ్మెల్యేల బి వెంకటస్వామి నియోజకవర్గ అభివృద్ధికి చేసిన కృషిని విమర్శనత్మకంగా వివరిస్తే ఓర్చుకోలేని టిడిపి నేత మాండ్ర శివానందరెడ్డి తన అనుచరులతో ప్రెస్ మీట్ పెట్టి తమ నేత లబ్బి వెంకటస్వామిపై అసభ్య పదజాలం ఉపయోగిస్తూ మాట్లాడడం తగదని వారు హెచ్చరించారు. తమ స్వసక్తితో ఎదిగిన నేత లబ్బి వెంకటస్వామిని స్పష్టం చేశారు. అది నియోజవర్గ ప్రజలందరికీ తెలుసునని రాజకీయ అవగాహన, అగ్రవర్ణ వ్యక్తుల వద్ద గుమస్తాలుగా పనిచేసిన వ్యక్తులకు మా నాయకుడు గురించి ఏం తెలుసునని మండిపడ్డారు. లబ్బి వెంకటస్వామినీ విమర్శించే స్థాయి పాత్రికేయుల సమావేశం నిర్వహించిన టిడిపి అగ్రవర్ణ గుమాస్తాకు పనికిరాని నాయకులకు లేదని చురకలంటించారు. మీ నేత మాడ్ర శివ నంద రెడ్డి సంఘవిద్రోహి నయీంతో సంబంధాలు కొనసాగించి వేలకోట్ల ఆస్తులు సంపాదించుకున్న చరిత్ర ఉమ్మడి రాష్ట్రాల ప్రజలకు తెలుసునన్నారు. అదేవిధంగా మంచిరేవులలో తక్కువ ధరకే దళిత ప్రజల భూములను దోచుకొని దళితుల ద్రోహిగా నిలిచిన నాయకుడు మీ నాయకుడు. మీ నాయకుడి భార్య చేసిన కబ్జాలపై న్యాయస్థానం తగిన రీతిలో బుద్ధి చెప్పడం మరిచిపోయావా ఓ దళిత నాయకుడా.. ముందు మీ టిడిపి నేత శివానందరెడ్డి చరిత్ర పరిశీలిస్తే నాటి మాజీ ఎమ్మెల్యే, మంత్రి బైరెడ్డి శేష సెనయన రెడ్డి పెట్టిన బిక్షనే ఆయన జీవితమన్నారు. ఎందుకు పనికిరాని చెంచాలుగా ఉన్న వ్యక్తులు తమ నేత లబ్బి వెంకటస్వామిని విమర్శిస్తే సహించేది లేదని హెచ్చరించారు. అసలైన దళిత ద్రోహి మీ నాయకుడు మాండ్ర శివానందరెడ్డి మండిపడ్డారు. ఎవరి దయ దాక్షిణ్యలతో మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి రాజకీయ ప్రవేశం జరగలేదని కేవలం దివంగత నేత మాజీ సీఎం వైయస్ ప్రోత్సాహంతో చైర్మన్గా, ఎమ్మెల్యేగా ప్రజలకు నిస్వార్థ పరిపాలన చేసిన నాయకుడు మా లబ్బి వెంకటస్వామి అని కొనియాడారు. అది గుర్తుంచుకొని టిడిపి ఎస్సీ సెల్ నాయకుడు జయసూర్య, మిగతా పనికిరాని చెంచాలు మాట్లాడితే బాగుంటుందని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో లాయర్ భాస్కర్, డాక్టర్ పి సుధాకర్, వైసీపీ ఎస్సీ సెల్ నాయకులు నాగ సురేష్,రమేష్, సంజన్న, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News