రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఈ నెల 14వ తేదీ నుంచి రాష్ట్రంలోని పంచాయతీల్లో నిర్వహించే ‘పల్లె పండుగ’ కార్యక్రమం గురించి జిల్లా కలెక్టర్లు, జిల్లా అధికారులకి వివరించి దిశా నిర్దేశం చేస్తున్నారు.



