Saturday, November 23, 2024
Homeఆంధ్రప్రదేశ్Panyam: వైసిపి చేపట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి

Panyam: వైసిపి చేపట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి

విజయవంతంగా ఉచిత బీమా నమోదు కార్యక్రమం

వైసీపీ ప్రభుత్వం చేపట్టిన ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాటసాని రాంభూపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. కర్నూలు నగరంలోని రావూరి గార్డెన్స్ లో , పాణ్యం ఎమ్యెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సచివాలయ జేసిఎస్ ఇంఛార్జ్ లు, సచివాలయ కన్వీనర్లకు ఉచిత బీమా నమోదు కార్యక్రమం విజయవంతంగా జరిగింది.

- Advertisement -

ఈ కార్యక్రమానికి నియోజకవర్గ పరిధిలోని, నాలుగు మండలాలు, కల్లూరు అర్బన్ జేసిఎస్ ఇంచార్జ్ లు, కన్వీనర్లు, పలువురు ప్రజాప్రతినిధులు తదితరులు హాజరయ్యారు. అనంతరం ఎమ్యెల్యే మాట్లాడుతూ… రాబోయే ఎన్నికల్లో కన్వీనర్లు, గృహ సారధుల పాత్ర ఎలా ఉండాలి, ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలి అన్న అంశంపై మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పిన విధంగా సచివాలయ కన్వీనర్లకు, గృహసారధులకు ఉచిత భీమా నమోదు ఏ విధంగా చేసుకోవాలి అన్న విషయాలను తెలియపరచారు. ఇంకా జేసిఎస్ సైన్యం యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని అందులో తమ వివరాలను ఎలా పొందుపరచాలి అన్న విషయాలను క్షుణ్ణంగా ఎమ్యెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి తెలియజేశారు.


ఈ కార్యక్రమంలో పాణ్యం మార్కెట్ కమిటీ చైర్మన్, డిప్యూటీ మేయర్, జడ్పీటీసీలు, ఎంపీపీ లు, కర్నూల్ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్, సర్పంచులు, కార్పొరేటర్లు, పలువురు వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, సచివాలయ కన్వీనర్లు, జేసిఎస్ ఇంచార్జ్ లు, వివిధ సంఘాల డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు..

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News