Monday, November 17, 2025
Homeఆంధ్రప్రదేశ్YCP: వైసీపీకి గొడ్డలి గుర్తును కేటాయించండి.. పార్టీ వ్యవస్థాపకుడు ఈసీకి సంచలన లేఖ

YCP: వైసీపీకి గొడ్డలి గుర్తును కేటాయించండి.. పార్టీ వ్యవస్థాపకుడు ఈసీకి సంచలన లేఖ

YCP Party Symbol: ఏపీ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటికే అధికార కూటమి ప్రభుత్వం, ప్రతిపక్ష వైసీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. 2029 ఎన్నికల్లో తమదే అధికారమని వైసీపీ ఆశాభావం వ్యక్తం చేస్తుంటే.. మరోసారి అధికారంలోకి వస్తామని కూటమి స్పష్టం చేస్తుంది. ఇదిలా ఉంటే వైసీపీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ వ్యవస్థాపకుడు శివకుమార్ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన లేఖ రాశారు.

- Advertisement -

తమ పార్టీ గుర్తును మార్చాలంటూ లేఖలో కోరారు. ప్రస్తుతం పార్టీకి ఉన్న ఫ్యాన్ గుర్తును తొలగించాలని విజ్ఞప్తి చేశారు. పార్టీలో అంతర్గత సంప్రదింపుల అనంతరం పార్టీ చిహ్నాం ఫ్యాన్ గుర్తును గొడ్డలి గుర్తుగా మార్చాలని ఏకగ్రీవంగా నిర్ణయించామని తెలిపారు. పార్టీ రాజకీయ వ్యూహంతో పాటు భవిష్యత్తు దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని.. దయచేసి పార్టీ గుర్తును గొడ్డలిగా మార్చాలని అభ్యర్థించారు.

తమ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుని 1968 ఎన్నికల చిహ్నాల ఆర్డర్ ప్రకారం సంబంధిత నియమాలకు అనుగుణంగా వీలైనంత త్వరగా తమ పార్టీ కొత్త చిహ్నంగా గొడ్డలిని కేటాయించాలని రిక్వెస్ట్ చేశారు. ఇందుకోసం పార్టీ ఎగ్జిక్యూటివ్ కమిటీ నుంచి అవసరమైన పత్రాలు జతచేశామని పేర్కొన్నారు. దీనిపై త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని.. ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా పూర్తిగా సహకరిస్తామని లేఖలో వెల్లడించారు. శివకుమార్ లేఖ ఏపీ రాజీకయాల్లో తీవ్ర సంచలనంగా మారింది. మరోవైపు ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకోనుందనే ఉత్కంఠ మొదలైంది.

Also Read: మందు బాబులకు గుడ్‌న్యూస్..ఇక పండగే పండగ!!

కాగా దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం శివకుమార్ వైఎస్సార్ పేరుతో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. అయితే వైఎస్ కుమారుడు జగన్.. శివకుమార్ నుంచి తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. వైసీపీగా ఫేమస్ అయిన ఈ పార్టీ గుర్తుగా ఫ్యాన్ ఉండేది.ఈ గుర్తు ప్రజల్లోకి బలంగా వెళ్లింది. గిరా గిరా తిరుగుతోంది ఫ్యాన్ అనే పాట 2019 ఎన్నికల్లో బాగా ఫేమస్ అయింది. ఇప్పుడు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడైన శివప్రసాద్ తమ పార్టీ గుర్తుగా గొడ్డలిని కేటాయించాలని ఏకంగా ఎన్నికల సంఘానికి లేఖ రాయడం తీవ్ర చర్చనీయాంశమైంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad