Sunday, July 7, 2024
Homeఆంధ్రప్రదేశ్Pathikonda: నీళ్లిస్తేనే ఓట్లేస్తాం, ఎమ్మెల్యేకి తెగేసి చెప్పిన మహిళలు

Pathikonda: నీళ్లిస్తేనే ఓట్లేస్తాం, ఎమ్మెల్యేకి తెగేసి చెప్పిన మహిళలు

పత్తికొండ మండల పరిధిలోని హోసూరు గ్రామంలో నిర్వహించిన ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మను హోసూరు గ్రామంలోని పక్కిరప్ప కట్ట వీధిలోనీ మహిళలు మా కాలనీలో నీళ్లు ఇస్తేనే ఓట్లు వేస్తామని ఎమ్మెల్యే ను నిలదీశారు. గ్రామ పంచాయతీ అధికారులు సంవత్సరం గడవక ముందే ఇంటి గుత్తలు, కొళాయి పన్ను, కట్టించుకోవడానికి పరిగెత్తుకు వస్తారని ఎమ్మెల్యే ముందు పంచాయతీ అధికారులను నిలదీశారు. కొంతమంది మహిళలు నీటి సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్దామని ప్రయత్నించే లోపే, స్థానిక వైఎస్ఆర్సిపి నాయకులు ముందుకు వెళ్ళిపోతున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పకీరప్ప కట్ట వీధిలో నీటి సమస్యను తీర్చాలని అధికారులకు సూచించారు. గడపగడప కార్యక్రమంలో ప్రతి ఇంటికి తిరుగుతూ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలు అందాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు బనగాని శ్రీనివాసులు, ఎంపీపీ నారాయణ దాసు, మండల కోఆప్షన్ నెంబర్ కారుమంచి నజీర్,మండల కన్వీనర్ కారం నాగరాజు, అధికార ప్రతినిధి శ్రీరంగడు,లలిత రామచంద్ర,ఎంపీడీవో పార్థసారథి,ఏపీవో వెంకటేశ్వర్లు,ఏ ఈ ఓ రియాజ్ భాషా,పంచాయతీ సెక్రెటరీ మునిస్వామి,సచివాల సిబ్బంది వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News