పత్తికొండ మండల పరిధిలోని పులికొండ గ్రామంలో పోస్ట్ ఆఫీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం ఒకరిది విధులు మరొకరు నిర్వహిస్తున్న పోస్ట్ ఆఫీస్ పై అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తుండడం తెలిస్తే అంతో ఇంతో పుచ్చుకోవడం పరిపాటిగా మారింది. పోస్టల్ అధికారులకు మండల పరిధిలోని పులికొండ గ్రామంలో స్థిరంగా ఉండి పోస్ట్ మెన్ గా విధులు నిర్వహించాలి. కానీ ఈ గ్రామంలో అందుకు విరుద్ధంగా నడుస్తుంది. పోస్ట్మాన్ గా పనిచేయాల్సిన మారెమ్మ పత్తికొండలో నివాసముంటున్నరు. మారెమ్మ భర్త పులికొండ గ్రామంలో పోస్ట్మాన్ గా చలామణి అవుతూ ఎల్ఐసి ఏజెంట్గా అవతారం ఎత్తాడు. పోస్టల్ డిపార్ట్మెంట్ కు అనుకూలంగా ఉంటూ ఆ డిపార్ట్మెంట్ ను ఉన్నత స్థాయికి తీసుకెళ్లకుండా తన సొంత ఆదాయం కోసం భార్య పోస్టును అడ్డం పెట్టుకుని అనేక సంవత్సరాలుగా పోస్ట్మాన్ గా చలామణి అవుతున్నాడు. అధికారులను వీటిని గుర్తించి వారివి విధుల నుంచి బహిష్కరించాలని పులికొండ గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు. ఇప్పటికైనా పోస్ట్ ఆఫీస్ డిపార్ట్మెంట్ కళ్ళు తెరిచి ప్రభుత్వం ఎవరికి ఉద్యోగం ఇచ్చిందో వారే విధులు నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు.
“వివరణ” : – భార్య నిర్వహించాల్సిన విధులను భర్త నిర్వహించడం మంచిది కాదని ఉద్యోగ నిర్వహణలో భార్యకు అవసరమైనప్పుడు సహాయం చేయవచ్చున్నారు పోస్ట్ ఆఫీస్ మేనేజర్ కృష్ణ నాయక్.