Monday, November 17, 2025
Homeఆంధ్రప్రదేశ్Pawan Kalyan: ఏపీ శకటానికి మూడో స్థానం.. పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు

Pawan Kalyan: ఏపీ శకటానికి మూడో స్థానం.. పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు

ఢిల్లీలో నిర్వహించిన రిపబ్లిక్ డే(Republic Day) వేడుకల్లో ఏటికొప్పాక బొమ్మలతో కూడిన ఏపీ శకటాన్ని ప్రదర్శించిన సంగతి తెలిసిందే. ఈ పరేడ్‌లో ప్రదర్శించిన శకటాల్లో ఏపీ మూడో స్థానంలో నిలించింది. తొలి రెండు స్థానాల్లో ఉత్తరప్రదేశ్, త్రిపుర నిలిచాయి. దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) స్పందించారు.

- Advertisement -

శకటాల పరేడ్‌లో ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఏటికొప్పాక లక్క బొమ్మల శకటం మూడో స్థానం సాధించడం ఆనందంగా ఉందని తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Draupadi Murmu), ప్రధాని మోడీకి(PM Modi) ప్రభుత్వం తరపున ధన్యవాదాలు చెప్పారు. ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఏటికొప్పాక బొమ్మలకు ప్రాచుర్యం కల్పించేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. బొమ్మల తయారీకి అవసరమైన అంకుడు కర్ర చెట్ల పెంపకానికి ప్రోత్సాహం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే అతిథులకు ఇచ్చే జ్ఞాపికల్లో వీటిని చేర్చామని వివరించారు. ఏటికొప్పాక శకటం రాష్ట్ర ప్రభుత్వం తరఫున పంపించినందుకు సీఎం చంద్రబాబు(CM Chandrababu)కు ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad