Sunday, November 16, 2025
Homeఆంధ్రప్రదేశ్Pawan Kalyan: కర్మ ఎవరినీ వదిలిపెట్టదు.. వాళ్లే అసెంబ్లీకి రాలేకపోతున్నారు: పవన్

Pawan Kalyan: కర్మ ఎవరినీ వదిలిపెట్టదు.. వాళ్లే అసెంబ్లీకి రాలేకపోతున్నారు: పవన్

Pawan Kalyan| కర్మ ఎవరినీ వదిలిపెట్టదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టిన రఘురామ కృష్ణంరాజు(Raghurama Krishnam Raju) ను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. వైసీపీ తరపున ఎంపీగా గెలిచిన రఘురామను సైతం శారీరకంగా, మానసికంగా హింసించారని గుర్తు చేశారు. ఏకంగా అధికార పార్టీ ఎంపీనే అరెస్ట్ చేసి దారుణంగా కొట్టడంతో.. ఏం చేస్తారో అని తనకు భయం వేసిందని తెలిపారు. క్రిమినల్స్ మైండ్ సెట్ ఉండే వాళ్లు రాజ్యాలు ఏలితే ఇలాగే ఉంటుంది అనిపించిందన్నారు.

- Advertisement -

వారి దుర్మార్గాలను ధైర్యంగా ఎదుర్కొని.. ఇప్పుడు డిప్యూటీ స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించడం గర్వకారణంగా ఉందన్నారు. నియోజకవర్గంలోకి వెళ్లనీయకపోయినా.. రచ్చబండ కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వెళ్లారని చెప్పారు. కర్మ ఎవ్వరినీ వదలదనే దానికి మీరే నిదర్శనమన్నారు. మిమ్మల్ని మీ నియోజకవర్గంలో అడుగు పెట్టనివ్వమని ఛాలెంజ్ చేసిన నేతలు.. ఇప్పుడు అసెంబ్లీలోకి కూడా అడుగుపెట్టలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. అధికారం మదమెక్కి అహంకారంతో విర్రవీగితే ఇలాగే జరుగుతుందని పవన్ వెల్లడించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad