Friday, November 22, 2024
Homeఆంధ్రప్రదేశ్Peddakadaburu: 'తెలుగుప్రభ' కథనానికి స్పందించిన విద్యాశాఖ అధికారి

Peddakadaburu: ‘తెలుగుప్రభ’ కథనానికి స్పందించిన విద్యాశాఖ అధికారి

పాఠశాల ఉపాధ్యాయులకు హెచ్చరికలు జారీ

బాపులదొడ్డి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు మండల విద్యాశాఖ అధికారి సువర్ణల సునీయం. విద్యార్థులకు విద్యను బోధించకపోతే ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉపాధ్యాయులు సమయపాలన కచ్చితంగా పాటించాలని ఉపాధ్యాయులకు తెలిపారు. పెద్దకడబూరు మండలంలోని బాపుల దొడ్డి గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు దాదాపుగా 206 మంది విద్యార్థులు ఆ పాఠశాలలో చదువుతుండగా ఆ పాఠశాలకు ఉపాధ్యాయులు 1+4- ఎస్ జి టి ఉపాధ్యాయులు ఉన్నారని విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు గురువారం ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు మండల విద్యాశాఖ అధికారిని సువర్ణల సునీయంకు తెలియజేస్తూ ఈ ఉపాధ్యాయులలో ఒకరు మెటర్నటి సెలవుల్లో వెళ్లారని, అలాగే ఇంకొక ఉపాధ్యాయుడేమో పూర్తిగా ఆరోగ్యం బాగులేక అసలు పాఠశాలకే రావడం లేదని, అక్కడ విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు.

- Advertisement -

మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నుండి ఒకరు ప్రధానోపాధ్యాయుడు, ఒక టీచర్, గవిగట్టి గ్రామం నుండి డిప్యూటేషన్ కింద ఒక ఉపాధ్యాయుడు బాపుల దొడ్డి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు తీసుకున్నామని గ్రామస్తులు తెలిపారు. అయితే ఈ ముగ్గురు ఉపాధ్యాయులు ప్రతిరోజు సమయపాలన పాటించడం లేదని, వాళ్లు అనుకున్నప్పుడే ఈ పాఠశాలకు వస్తారని, విద్యార్థులకు విద్యాబోధన నేర్పించడం లేదని పాఠశాలలో విద్యార్థులు ఎప్పుడు చూసిన అల్లరితో కూడిన శబ్దాలే వినిపిస్తాయని విద్యార్థుల తల్లిదండ్రులు, అక్కడున్న చుట్టుపక్కల కాలనీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. మా విద్యార్థుల విద్యను కోల్పోతున్నారని ఇక్కడికొచ్చే ఉపాధ్యాయులు సమయపాలన పాటించి విద్యార్థులకు విద్యాబోధన నైపుణ్యాన్ని పెంపొందించే విధంగా చర్యలు తీసుకోవాలని విద్యార్థుల విద్యను కోల్పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీపై ఉందని విద్యాశాఖ అధికారిణి సువర్ణల సునీయం అన్నారు. అన్నదానం కన్నా విద్యాదానం గొప్పదని ఉపాధ్యాయులకు, విద్యార్థులకు తెలిపారు. ఈ మండల విద్యాశాఖ అధికారిని సువర్ణల సునీయం, ఎం ఆర్ సి లక్ష్మన్న, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News