Thursday, November 21, 2024
Homeఆంధ్రప్రదేశ్Vidadala Rajini: మాజీ మంత్రి విడదల రజినీపై పోలీసులకు ఫిర్యాదు

Vidadala Rajini: మాజీ మంత్రి విడదల రజినీపై పోలీసులకు ఫిర్యాదు

Vidadala Rajini| ఏపీలో వైసీపీ నేతలు, కార్యకర్తలపై వరుసగా పోలీస్ కేసులు నమోదవుతున్నాయి. ఓవైపు అసభ్యకర పోస్టుల పెట్టారంటూ వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్ట్ చేస్తుంటే.. మరోవైపు తమను వేధించారంటూ ఆ పార్టీ నేతలపైనా పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా మాజీ మంత్రి, వైసీపీ మహిళా నేత విడదల రజినీపై పోలీస్ కేసు నమోదైంది.

- Advertisement -

విడదల రజినీతో పాటు ఆమె పీఏ రామకృష్ణ, అప్పటి సీఐ సూర్యనారాయణపై జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావుకు ఐటీడీపీ చిలకలూరిపేట అధ్యక్షుడు పిల్లి కోటేశ్వరరావు, పలువురు టీడీపీ కార్యకర్తలు పిర్యాదు చేశారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తమను తప్పుడు కేసులతో దారుణంగా వేధించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్‌లో అక్రమంగా నిర్బంధించి, చిత్రహింసలకు గురిచేశారని ఆరోపించారు. తమను చిత్రహింసలకు గురిచేసిన దృశ్యాలను లైవ్‌లో చూస్తూ విడదల రజినీ పైశాచిక ఆనందం పొందారని తెలిపారు. దీనిపై కేసు నమోదుచేసి విచారణ జరపాలని ఎస్పీని కోరారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News