వైసీపీ మాజీ నేత, నటుడు పోసాని కృష్ణమురళి(Posani Krishna murali) ఎట్టకేలకు జైలు నుంచి విడుదల అయ్యారు. ఇప్పటికే మూడు కేసుల్లో బెయిల్ రాగా.. శుక్రవారం సీఐడీ అధికారులు నమోదుచేసిన కేసులోనూ బెయిల్ రావడంతో గుంటూరు జైలు నుంచి బయటకు వచ్చారు. దీంతో జైలు వద్దకు చేరుకున్న మాజీ మంత్రి అంబటి రాంబాబుతో పాటు వైసీపీ నేతలను చూసిన పోసాని భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా అంబటిని హత్తకుని కంటతడి పెట్టుకున్నారు.
కాగా టీడీపీ అధినేత, ప్రస్తుత సీఎం చంద్రబాబు(Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan), మంత్రి లోకేశ్‌పై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో ఫిబ్రవరి 26న పోసాని అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లలో ఆయనపై కేసులు నమోదు కావడంతో రాజంపేట, విజయవాడ, నరసరావుపేట, కర్నూలు, గుంటూరు జిల్లా జైళ్లలో రిమాండ్ ఖైదీగా శిక్ష అనుభవించారు.