ఢిల్లీ సీఎం(Delhi CM) ప్రమాణ స్వీకార కార్యక్రమంలో జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan kalyan)ను ప్రధాని మోదీ ఆప్యాయంగా పలకరించిన సంగతి తెలిసిందే. పవన్‌కు షేక్ హ్యాండ్ ఇచ్చి కొద్దిసేపు సరదాగా ముచ్చటించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జనసైనికులు ఇది పవన్ కళ్యాణ్ రేంజ్ అంటూ ఈ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు.
కాగా ఈ వేదిక మీద ప్రధాని మోదీ తనలో ఏం మాట్లాడారనే విషయాన్ని పవన్ మీడియాతో పంచుకున్నారు. ‘ప్రధాని నాతో చిన్న జోక్ చేశారు. ఇవన్నీ వదిలేసి హిమాలయాలకు వెళ్లాలి అనుకుంటున్నారా? అని అడిగారు. అందుకు ఇంకా చాలా టైమ్ ఉందని చెప్పాను. నువ్వు చేయాల్సిన పని చేయ్ అని నాతో చెప్పారు’ అని వెల్లడించారు.
ఇదిలా ఉంటే అంతకుముందు కూడా పవన్ కళ్యాణ్‌ను మోదీ పొగిడిన సంగతి తెలిసిందే. ఎన్టీయే ముఖ్య నేతల సమావేశంలో మోదీ మాట్లాడుతూ పవన్‌ను తుఫాన్ అంటూ అభివర్ణించారు. దీనిని బట్టి పవన్ కళ్యాణ్‌కు ప్రధాని ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో అర్థమవుతోందని రాజకీయ విశ్లేకులు అభిప్రాయపడుతున్నారు.