నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన వాయుగుండం
చెన్నైకి 320 కి.మీ., పుదుచ్చేరికి 350 కి.మీ, నెల్లూరుకి 400కి.మీ దూరంలో కేంద్రీకృతం
వాయువ్య దిశగా 15కిమీ వేగంతో కదులుతున్న వాయుగుండం
దక్షిణకోస్తా, రాయలసీమలో కొన్ని చోట్ల భారీ నుండి అతిభారీ వర్షాలు, పలుచోట్ల తీవ్రభారీ వర్షసూచన
విపత్తుల నిర్వహణ సంస్థలోని కంట్రల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ
ప్రకాశం,నెల్లూరు,చిత్తూరు,కడప జిల్లాల్లో ఆకస్మిక వరదలు (ఫ్లాష్ ఫ్లడ్) సంభవించే అవకాశం
లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
పెన్నా నది పరీవాహక ప్రాంతప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి
ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, జిల్లా యంత్రాంగానికి తీవ్రతను బట్టి సూచనలు
ఇప్పటికే సహాయక చర్యలకోసం రూ.కోటి చొప్పున జిల్లాలకు అత్యవసర నిధులు
నెల్లూరు,తిరుపతి,కర్నూలు,ప్రకాశం,బాపట్ల జిల్లాల్లో 5ఎస్డీఆర్ఎఫ్, 2 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు
ప్రకాశం 4, నెల్లూరు 6, అన్నమయ్య జిల్లాలోని 3 మండలాల్లో ఎక్కువ ప్రభావం
అవసరమైన చోట 15 పునరావాస కేంద్రాలు ఏర్పాటు
సముద్రంలో వేటకు వెళ్ళిన 61,756 మంది మత్స్యకారులను వెనక్కి రప్పించాము
~ రోణంకి కూర్మనాథ్, ఎండి, విపత్తుల నిర్వహణ సంస్థ.