Rajampet Former MLA Kasireddy Madam Mohan Reddy Died: రాజంపేట మాజీ ఎమ్మెల్యే కసిరెడ్డి మదన్‌మోహన్ రెడ్డి (77) తుదిశ్వాస విడిచారు. 1989లో నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి కొండూరు ప్రభావతమ్మపై 10,510 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలుపొందారు. అనంతరం 1999లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2009 ఎన్నికల్లో తెదేపా తరఫున బరిలోకి దిగారు. చివరిగా 2019లో వైకాపాలో చేరిన ఆయన.. ఆ తర్వాత వయోభారంతో రాజకీయాలకు దూరమయ్యారు. ఇటీవలే తీవ్ర అనారోగ్యానికి గురై హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందారు. కానీ దురదృష్టవశాత్తు.. పరిస్థితి విషమించడంతో మృతి చెందారు. కాగా, మదన్ మోహన్ రెడ్డి మృతికి పలువురు నేతలు సంతాపం వ్యక్తం చేశారు.
Also Read: https://teluguprabha.net/andhra-pradesh-news/ap-liquor-scam-sit-additional-charge-sheet/
చెంచురెడ్డి కూడా..
SriKalahasti Former MLA Tatiparthi Chenchureddy died: తిరుపతి శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే తాటిపర్తి చెంచురెడ్డి కూడా అనారోగ్యంతో చికిత్స పొందుతూ కన్నుమూశారు. విద్యార్థి దశనుంచీ కాంగ్రెస్ పార్టీలో పోరాట నాయకుడిగా పేరు పొందిన ఆయన.. 1978, 1983, 1985 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున శ్రీకాళహస్తి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. సుదర్ఘీకాలం కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన ఆయన 2019 ఎన్నికల ముందు వైసీపీలో చేరారు. ఇటీవలే వయసు మీదపడటంతో అనారోగ్యానికి గురయ్యారు. తిరుపతిలో చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. ఆయన మృతిపై కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ చింతామోహన్, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి, వైసీపీ నేత సిరాజ్‌బాషా సహా పలువురు సంతాపం తెలిపారు.


