Saturday, November 23, 2024
Homeఆంధ్రప్రదేశ్RRR centres: ఆర్ఆర్ఆర్ సెంటర్స్ ను వినియోగించుకోండి

RRR centres: ఆర్ఆర్ఆర్ సెంటర్స్ ను వినియోగించుకోండి

ఎమ్మిగనూరు పట్టణ ప్రజలు అర్అర్అర్ సెంటర్స్ ను సద్వినియోగం చేసుకోవాలని వైసిపి నేత ఎర్రకోట జగన్ మోహన్ రెడ్డి కోరారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్బంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల సూచనల మేరకు, ఎమ్మిగనూరు పురపాలక సంఘం అధ్వర్యంలో మేరా లైఫ్ -మేరా స్వచ్ఛ షేహర్ ఆర్. ఆర్. ఆర్ (రెడ్యూస్, రియూజ్, రిసైకిల్ ) పురస్కరించుకొని, ఈ నెల 20 వ తేదీ నుండి జూన్ 5వ తేదీ వరకు ఉంటుంది. ఎమ్మిగనూరు పట్టణ పరిధిలోని 20వ వార్డ్, పాత మున్సిపల్ ఆఫీస్ లో పట్టణంలోని ప్రతి సచివాలయం వద్ద ఏర్పాటు చేసిన ఆర్ఆర్ఆర్( రెడ్యూస్,రిసైకిల్, రియూజ్ )సెంటర్ ను పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని,ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1:00 వరకు ఉంటుందని, ఈనెల 20 తారీకు నుండి జూన్ 5వ తారీఖు వరకు త్రిబుల్ ఆర్ సెంటర్స్ పనిచేస్తాయని తెలిపారు. అనంతరం మున్సిపల్ కమీషనర్ ఎన్. గంగిరెడ్డి మాట్లాడుతూ ఈ నెల 20 నుండి జూన్ 5 వరకు అందుబాటులో ఉంటుందన్నారు. ఇళ్లల్లో నిరూపయోగంగా ఉన్న దుస్తులు, బూట్లు, చెప్పులు, టోపీలు,పరుపులు, బెడ్ షీట్లు,దుప్పట్లు,పుస్తకాలు,బ్యాగ్ లు,పిల్లలు ఆడుకునే బొమ్మలు, సైకిళ్ళు,చెక్క కుర్చీలు,ఇనుప కుర్చీలు,టేబుల్స్,చెక్క మంచాలు,ఇనుప మంచాలు,ఎలక్ట్రానిక్ పరికరాలు వస్తువులను ఈ సెంటర్ కి అందిస్తే, వారు వాటి అవసరం ఉన్న ఇతరులకు వాటిని అందజేస్తారని తెలిపారు.ఈ సెంటర్ కు నిరూపయోగంగా ఉన్న వస్తువులు ఇవ్వదలచి న వారు తమ ఏరియాలోని శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీకి సమాచారం ఇవ్వాలని సూచించారు.వారు ఆయా వస్తువులను ఆర్.ఆర్. ఆర్( రెడ్యూస్, రిసైకిల్, రియూజ్ )సెంటర్ కి తరలిస్తారని తెలిపారు. మనకి పనికిరాకుండా ఉండి, ఇతరులకి ఉపయోగపడే వస్తువులని వారికి అందించి, సహాయపడే విధంగా అవకాశం కల్పిస్తున్న స్వచ్చాంధ్ర కార్పొరేషన్ సేవలకు పట్టణ ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రఘు, వైస్ చైర్మన్ నజీర్ అహమ్మద్ ,బుట్టా రంగయ్య, వైఎస్ఆర్సిపి నాయకులు, కౌన్సిలర్ శివప్రసాద్ ,శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు మరియు సత్యన్న, వెంకటేశ్వర్లు టీఎంసీ, పుల్లయ్య,సి ఓ లు, వార్డ్ శానిటేషన్ ఎన్విరాన్మెంటల్ సెక్రటరీలు, మెస్రీ లు మెప్మా సిబ్బంది ,ఆర్పీలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News