Friday, March 28, 2025
Homeఆంధ్రప్రదేశ్Rudravaram: శ్రీ వాసాపుర వెంకటేశ్వర స్వామి వార్షికోత్సవాలు

Rudravaram: శ్రీ వాసాపుర వెంకటేశ్వర స్వామి వార్షికోత్సవాలు

రుద్రవరం మండల కేంద్రమైన రుద్రవరం అప్పనపల్లె ప్రధాన రహదారి మార్గమధ్యంలోని వెలగలపల్లె గ్రామ పొలిమేరలో వెలసిన శ్రీ వాసాపుర వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రధమ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వామివారి ప్రథమ వార్షికోత్సవ సందర్భంగా సమీప గ్రామాలతో పాటు పలు ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన శాంతిహోమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డి, సీఐ చంద్రబాబు నాయుడు స్వామివారిని దర్శించుకునేందుకు రాగా ఆలయ నిర్వాహకులు ఆలయ ప్రధాన అర్చకులు వారణాసి గోపి శర్మ చే ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం హోమ కార్యక్రమంలో, స్వామి వారి కళ్యాణం లో వారు పాల్గొన్నారు. అనంతరం వారికి ఆలయ నిర్వాహకులు శాలువ, పూలమాలతో సన్మానించి స్వామివారి జ్ఞాపికలను అందజేశారు. వారి వెంట ఆళ్లగడ్డ మార్కెట్ యార్డ్ చైర్మన్ గంధం వీర రాఘవరెడ్డి, ఎస్ఐ శరత్ కుమార్ రెడ్డి, ఏఎస్ఐలం బాలన్న, శోభన్ బాబు, రాంభూపాల్ రెడ్డి, పోలీస్ సిబ్బంది ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News