Thursday, September 19, 2024
Homeఆంధ్రప్రదేశ్Shadnagar: ఘనంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు

Shadnagar: ఘనంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు

షాద్ నగర్ పట్టణంలోని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి స్వగృహం లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.
మోదీ జన్మదినం సందర్బంగా నాయకులు, కార్యకర్తలు మిఠాయిలు పంచుకొని సంబరాలు చేసుకున్నారు.
ఈ సంధర్బంగా విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ;
ప్రపంచ దేశాలు సైతం భారత్ వైపు చూసే విదంగా మోదీ పాలన కొనసాగిస్తున్నారని అన్నారు.
దేశం కోసం, దర్మం కోసం నిరంతరం శ్రమిస్తున్న నాయకులు మోదీ అని అన్నారు
అసధ్యాలను సుసాధ్యం చేయగల మేధావి అని కొనియాడారు.
అన్ని వర్గాల వారు మెచ్చే విదంగా పాలన కొనసాగిస్తున్నారని ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రిగా ఆయన మన భారతదేశన్ని మరింత అభివృద్ధి చేస్తున్నారని విదేశాలతో ఘాటుగా పోటీ పడుతూ అన్ని రంగాలలో అభివృద్ధి వైపుకు భారతదేశాన్ని దూసుకుపోయేలా ఆయన మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు ఇస్నాతి శ్రీనివాస్, లష్కర్ నాయక్,చేగు సుధాకర్, శ్యాం సుందర్ రెడ్డి,గజల్ ప్రవీణ్,రంగన్న గౌడ్, రాజు నాయక్, శంకరయ్య,శివానంద్, గణేష్ నాయక్,ఇస్నాతి గంగాదర్, కిరణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు…

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News