Friday, November 22, 2024
Homeఆంధ్రప్రదేశ్Sridevamma: జగనన్న సురక్షత పేద ప్రజలకు శ్రీరామరక్ష

Sridevamma: జగనన్న సురక్షత పేద ప్రజలకు శ్రీరామరక్ష

పేద ప్రజల సంక్షేమానికి భరోసా

జగనన్న సురక్షత పేద ప్రజల సంక్షేమానికి భరోసా ఇచ్చేందుకు సీఎం జగన్ మోహన్ రెడ్డి జగనన్న సురక్ష కార్యక్రమం ప్రవేశపెట్టారని ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ అన్నారు. పత్తికొండ పట్టణంలో సచివాలయం 5,6 పరిధిలో నిర్వహించిన సదస్సులో ఎమ్మెల్యే శ్రీదేవమ్మ పాల్గొని కులం, ఆదాయం ఫ్యామిలీ సర్టిఫికెట్ లతో పాటు11 రకాల ధృవీకరణ పత్రాలు పేద ప్రజలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద ప్రజలకు ఎలాంటి సర్వీసు చార్జీలు లేకుండా సచివాలయాల ద్వారా ఉచిత సేవలను ప్రజలు ఉపయోగించుకోవాలని ఆమె ప్రజలను కోరారు. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, మరణ, జనన, పొలం పట్టాదారు పాసు పుస్తకాలు, వివాహ దృవీకరణ పత్రము, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్, హౌస్ ఓల్డ్ మ్యాపింగ్, కొత్త రేషన్ కార్డులు కోసం అర్జీలు పెట్టుకున్న లబ్ధిదారులందరికి గ్రామ వార్డు వాలంటీర్లు, సచివాలయ అధికారులు పేద ప్రజలకు ఉచితంగా ధ్రువీకరణ పత్రాలను అందించాలని ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కొమ్ము దీపిక, ఎంపీపీ నారాయణదాసు, వైస్ ఎంపీపీ కొత్తపల్లి బలరాముడు మాజీ ఎంపీపీ ఎస్ నాగరత్నమ్మ, వైసీపీ మండల కన్వీనర్ కారం నాగరాజు, పత్తికొండ మండలం అధికారులు, సచివాలయం సిబ్బంది, గ్రామ సచివాలయం కన్వీనర్లు, వార్డ్ మెంబర్లు పాల్ భాష, మాజీ సర్పంచ్ సోమశేఖర్, వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News