శ్రీశైలం పర్యటనకు భారత ప్రధాన న్యాయమూర్తి విచ్చేశారు. శ్రీశైలం మహాక్షేత్రంలోని భ్రమరాంబ అతిథి గృహం వద్ద శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల దర్శనార్థం విచ్చేసిన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ధనుంజయ వై. చంద్రచూడ్, ఆయన సతీమణి కల్పనా దాస్ కు ఘనంగా స్వాగతం పలికారు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి.
