శ్రీశైలం మహా క్షేత్రంలో భోగి పండుగను పురస్కరించుకుని దేవస్థానం సామూహిక భోగిపండ్ల కార్యక్రమాన్ని నిర్వహించింది. అయిదు సంవత్సరాల వయస్సు వరకు గల చిన్న పిల్లలకు భోగింపండ్లు వేసి, వారిని ఆశీర్వదించారు. 50 మంది పైగా చిన్నారులకు ఆలయప్రాంగణంలో భోగిపండ్లు పోశారు. ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ సనాతన సంప్రదాయ పరిరక్షణలో భాగంగా దేవస్థానం ఈ సామూహికంగా భోగింపడ్లు పోసే కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. ఈ భోగిపండ్లను వేయడం వలన పిల్లలకు పీడలు తొలగి, దృష్టిదోషాలు నశించి, ఆయురారోగ్యాలు చేకూరుతాయని ఆలయ అర్చకులు వివరించారు.
Srisailam: శ్రీశైలంలో చిన్నపిల్లలకి సామూహిక భోగిపండ్లు
సంబంధిత వార్తలు | RELATED ARTICLES