Wednesday, October 30, 2024
Homeఆంధ్రప్రదేశ్CM Chandrababu tour in Srisailam: సీఎం చంద్రబాబు శ్రీశైలం పర్యటన సందర్భంగా భద్రతా ఏర్పాట్ల...

CM Chandrababu tour in Srisailam: సీఎం చంద్రబాబు శ్రీశైలం పర్యటన సందర్భంగా భద్రతా ఏర్పాట్ల పరిశీలన

1100 మంది పోలీస్ అధికారులతో..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు నంద్యాల జిల్లా శ్రీశైలంలో పర్యటించనున్న సందర్భంగా పోలీస్ అధికారులు సిబ్బందితో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా IPS, ముఖ్యమంత్రి పర్యటించే ప్రదేశాలను స్వయంగా పర్యటించి తీసుకోవలసిన భద్రత చర్యల గురించి సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు.

- Advertisement -


ముఖ్యమంత్రి శ్రీశైలం చేరుకున్నప్పటినుండి తిరిగి వెళ్లే వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సుమారు 1100 మంది పోలీస్ అధికారులు వారి సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
ముఖ్యమంత్రి పర్యటించే ప్రదేశాలను 11 సెక్టర్లుగా విభజించారు. ప్రతి సెక్టార్ కు ఇన్స్పెక్టర్ స్థాయి అధికారిని ఆపై డి.ఎస్.పి స్థాయి అధికారులు నియమించారు. సుండిపెంట హెలిపాడ్ నుండి టెంపుల్ వరకు, హెలిపాడ్ నుండి పవర్ ప్రాజెక్ట్ డాం వరకు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా సుమారు 180 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేస్తూ ఒక డీఎస్పీ స్థాయి అధికారితో పాటు ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులను నియమించారు.


B.D టీంకు డిఎస్పి స్థాయి అధికారిని నియమించి DFMD లు, HFMD లు ఇతర పూర్తి పరికరాలతో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తారు. హెలిప్యాడ్ నుండి శ్రీశైలం ముఖద్వారం, హఠకేశ్వరం, సాక్షిగణపతి, నందిసర్కిల్, VVIP అతిథి గృహ పరిసర ప్రాంతాలు, కొత్తపేట సుండిపెంట స్విచ్ యాడ్ లింగాల గట్టు ఆనకట్ట మొదలగు ప్రాంతాల్లో కట్టుబిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. గ్రేహౌండ్స్, స్పెషల్ పార్టీ బలగాలతో శ్రీశైలం అడవులన్నింటినీ జల్లెడ పడుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News