అన్నమయ్య జిల్లా రాజంపేట సబ్ జైలులో పోసాని కృష్ణ మురళితో రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ములాకత్ అయ్యారు. జైల్లో ఉన్న పోసాని అనారోగ్యంతో బాధపడుతున్నట్లు ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి తెలిపారు.
అనంతరం జైలు బయట పోసాని మిత్రులతో ఎంఎల్ఏ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి మాట్లాడారు. రాజంపేట సబ్ జైలుకు చేరుకున్నారు రైల్వే కోడూరు మాజీ శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు. కోరముట్ల శ్రీనివాసులను ములాఖాత్ కు సబ్జైలర్ మల్ రెడ్డి నిరాకరించారు.
ములాఖాత్ పెట్టుకున్నా పంపలేదని మాజీ ఎంఎల్ఏ కొరముట్ల శ్రీనివాసులు జైలర్ తో అసహనం వ్యక్తం చేశారు. కొద్దిసేపటి క్రితం రాజంపేట సబ్ జైల్లో ఉన్న పోసాని కృష్ణమురళికి తీవ్ర అస్వస్థతగా ఉండటంతో అత్యవసర చికిత్స నిమిత్తం రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి జైలు సిబ్బంది తరలించారు. పోసానికి వైద్య చికిత్సలు అందిస్తున్నారు.