ఏపీ సీఐడీ మాజీ చీఫ్ సంజయ్ కుమార్(Sanjay Kumar)కు సుప్రీంకోర్టు (Supreme Court) నోటీసులు జారీ చేసింది. వైసీపీ ప్రభుత్వంలో అగ్నిమాపక విభాగం డీజీగా పనిచేసిన ఆయనపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. దీంతో కూటమి ప్రభుత్వం ఇటీవల కేసు నమోదు చేసింది. దీంతో వెంటనే సంజయ్ ఈ కేసులో పోలీసులు అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
అయితే హైకోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. తాజాగా ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ అమానుతుల్లా, జస్టిస్ పి.కె. మిశ్రా ధర్మాసనం ప్రభుత్వ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని సంజయ్‌కు నోటీసులు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను నెలాఖరుకు వాయిదా వేసింది. కాగా సంజయ్ సీఐడీ చీఫ్‌గా ఉన్నప్పుడే అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబును అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.