బనగానపల్లె నియోజకవర్గంలో సంజామల మండలం పేరుసోముల గ్రామానికి చెందిన 50 కుటుంబాలు టిడిపి పార్టీని వీడి బనగానపల్లె నియోజకవర్గ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ పార్టీలో చేరారు. పేరుసోముల గ్రామానికి చెందిన మహిళలు బషీరున్, కొత్త కొట్టాల హుస్సేన్ బి, రసూల్ బి, మండ్ల లక్ష్మీదేవి ,చింతమాను నాగరాజమ్మ , చింతామాను లక్ష్మమ్మ, మిద్దె వెంకట లక్ష్మమ్మ, చాకలి బాలక్క తమ్మడపల్లి గురమ్మ బీరు సంటి ఆరోగ్యమ్మ ఓట్ల రత్నకుమారి అమ్మటాల రమణమ్మను బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి వైఎస్ఆర్ పార్టీ వైఎస్ఆర్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. టిడిపి పార్టీని వీడి వైఎస్ఆర్ పార్టీలో చేరిన వారందరికీ వైఎస్ఆర్ పార్టీలో సముచిత స్థానాన్ని కల్పిస్తానని ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి తెలిపారు.
ఈ సందర్భంగా బనగానపల్లె నియోజకవర్గ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ సంజామల మండల కేంద్రంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ గ్రామాల ప్రజల నుంచి అనుహస్పందన లభిస్తుందని తెలిపారు. సంజామల మండలం పేరు సోమల గ్రామానికి చెందిన 50 కుటుంబాలు నేడు టిడిపి పార్టీని వీడి వైఎస్ఆర్ పార్టీలో చేరారని వైయస్సార్ పార్టీలో చేరిన వారందరికీ తగిన గుర్తింపు, సమచితస్థానాన్ని కల్పిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గుండం సూర్య ప్రకాశ్ రెడ్డి,జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ మల్కిరెడ్డి వెంకటసుబ్బారెడ్డి,మండల పరిషత్ ఉపాధ్యక్షుడుచిన్నబాబు, చిన్నపెద్దన్న, రామాంజనేయులు, కోటపాడు రామన్న, కోటపాడు రాంగోపాల్, బెలుం థామాస్, నాగేశ్వర రావు, జగదీశ్వరయ్య, తమ్మడపల్లే నాగన్న, CH కంబగిరి, రామేశ్వర్ రెడ్డి, సోమేశ్వర రెడ్డి, శ్రీను, వైయస్సార్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.