Thursday, July 4, 2024
Homeఆంధ్రప్రదేశ్Thikkareddy: భవిష్యత్తుకు గ్యారెంటీ-ఇది బాబు గ్యారెంటీ

Thikkareddy: భవిష్యత్తుకు గ్యారెంటీ-ఇది బాబు గ్యారెంటీ

టీడీపీ మంత్రాలయం నియోజకవర్గం ఇంచార్జ్ తిక్కారెడ్డి

భవిష్యత్తుకు గ్యారెంటీ ఇది బాబు గ్యారెంటీ అనే కార్యక్రమం పెద్ద కడుబూరు మండలంలోని చిన్న తుంబలం గ్రామంలో రాష్ట్ర రైతు అధికార ప్రతినిధి నరవ రమాకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రాలయం టిడిపి ఇంచార్జ్ పాలకుర్తి తిక్కారెడ్డి ప్రారంభించడం జరిగింది. ప్రతి ఇంటి గడప తిరుగుతూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన పథకాలను వివరిస్తూ మహాశక్తి అనే పథకం ద్వారా తల్లికి వందనం పేరుతో మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే వారందరికీ ఒక్కొక్కరికి ఏడాదికి 15000 రూ, అని ఆడ బిడ్డ నిధి నుంచి18 ఏళ్ల నిండిన ప్రతి స్త్రీకి నెలకు 15000 రూ,దీపం పేరుతో ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు అని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం,ప్రతి రైతుకు ఏట 20,000 ఆర్థిక సాయం, ఇంటింటికి మంచినీరు పథకం కింద ప్రతి ఇంటికి రక్షిత తాగునీరు కొళాయి కనెక్షన్,20 లక్షల మంది యువతకు ఉపాధి నిరుద్యోగులకు యువగలం నుంచి నెలకు 3000 నిరుద్యోగ భృతి అందిస్తుందని పేదలను సంపన్నులను చేసే ఐదేళ్ల కనీసం రెట్టింపు ఆదాయంగా మన ప్రభుత్వం ఆదుకుంటుందని అలాగే బీసీలకు రక్షణ చట్టం తెచ్చి వారికి అన్ని విధాల అండ దండాలు తోడుగా ఉంటుందని రాబోయే 2024 ఎలక్షన్ లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా మన చంద్రబాబునాయుడు ఆదరించి గెలిపించాలని ప్రతి ఇంటి గడపలో తెలియజేశారు.రాష్ట్ర ప్రభుత్వాన్ని సంక్షేమం అభివృద్ధి బాటలో నడిపించే దశగా మన చంద్రబాబు నాయుడు ముందు చూసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైతు అధికార ప్రతినిధి నరవ రమాకాంత్ రెడ్డి, సర్పంచ్ శివ, వీరేష్ గౌడ్, డీలర్ నరసింహులు, బద్రి, మాజీ ఎంపీటీసీ ఈరన్న, దాసప్పి రెడ్డి, బాషా, నల్లారెడ్డి, తిక్కన్న, తిక్కయ్య, బొగ్గుల భాష, టిడిపి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News