Friday, November 22, 2024
Homeఆంధ్రప్రదేశ్Thikkareddy: డ్యాన్సు చేసేందుకు కాదు ప్రజాసేవకే మంత్రులు

Thikkareddy: డ్యాన్సు చేసేందుకు కాదు ప్రజాసేవకే మంత్రులు

27వ రోజుకు మేము సైతం దీక్షలు

రాష్ట్ర ప్రభుత్వ క్యాబినెట్ లో పనిచేస్తున్న మంత్రులు మీరు ఉన్నది ప్రజలకు సేవ చేయడానికి అంతేగాని ప్రతిపక్ష నాయకులను బూతులు తిట్టడానికి, డ్యాన్సులు వేయడానికి కాదు అని మంత్రాలయం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ బాధ్యులు పాలకుర్తి తిక్కారెడ్డి రెడ్డి అన్నారు.

- Advertisement -

మంత్రాలయంలో చంద్రబాబుకు మద్దతుగా మేము సైతం అంటూ చేస్తున్న రిలే నిరాహార దీక్షలో 27వ రోజు చంద్రబాబు కు మద్దతుగా వీరశైవ లింగాయితి, రెడ్డి కులస్తులు రిలే నిరాహారదీక్షలో కూర్చున్నారు. ఈ కార్యక్రమంలో తిక్కారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబుపై పెట్టిన అక్రమ కేసు కోర్టుకు ఆధారాలు చూపించకుండా జగన్ ప్రభుత్వం తుగ్లక్ పాలన నడుపుతుందని ప్రపంచం మొత్తం చంద్రబాబు కు మద్దతుగా ఉంది అని రానున్న రోజుల్లో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు.

అంతకుముందు వీరశైవకుల దైవం బసవేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు..! ఈ దీక్ష కార్యక్రమంలో తెలుగు రైతు రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమకాంత్ రెడ్డి, తెలుగు రైతు రాష్ట్ర కార్యదర్శి అడిగప్ప గౌడ్, తెలుగు యువత జిల్లా ప్రధాన కార్యదర్శి పాలకుర్తి దివాకర్ రెడ్డి, తెలుగు యువత నియోజకవర్గం అధ్యక్షులు బాపురం సుధీర్ రెడ్డి, టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు చెన్న బసప్ప , తెలుగు రైతు జిల్లా కార్యదర్శి ఎల్లారెడ్డి, గోపాల్ రెడ్డి, వెంకటరెడ్డి, రమేష్ గౌడ్, భాస్కర్ రెడ్డి, కూర్చున్నారు.. మంత్రాలయం మండలం కన్వీనర్ పన్నాగ వెంకటేశప్ప స్వామి, వాణిజ్య విభాగం జిల్లా ఉపాధ్యక్షులు భరద్వాజ్ శెట్టి, బిసి సీనియర్ నాయకులు వక్రాని వెంకటేశ్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News