Sunday, November 16, 2025
Homeఆంధ్రప్రదేశ్TTD Alert: తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత: రేపు, ఎల్లుండి దర్శనానికి అంతరాయం..ఎందుకంటే..?

TTD Alert: తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత: రేపు, ఎల్లుండి దర్శనానికి అంతరాయం..ఎందుకంటే..?

Big alert from TTD: తిరుమల శ్రీవారి భక్తులకు ఒక ముఖ్యమైన సమాచారం. చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయం సెప్టెంబర్ 6 మధ్యాహ్నం 3:30 గంటల నుండి సెప్టెంబర్ 7 తెల్లవారుజామున 3:00 గంటల వరకు మూసివేయబడుతుంది. మొత్తం 12 గంటల పాటు ఆలయం మూసి ఉంటుంది.

- Advertisement -

గ్రహణం సెప్టెంబర్ 6 రాత్రి 9:50 గంటల నుండి సెప్టెంబర్ 7 తెల్లవారుజామున 1:31 గంటల వరకు ఉంటుంది. గ్రహణం ప్రారంభానికి ఆరు గంటల ముందు ఆలయ తలుపులు మూసివేయడం సంప్రదాయం.

ఆదివారం (సెప్టెంబర్ 6) మధ్యాహ్నం 3 గంటల నుండి అన్నప్రసాద పంపిణీ కేంద్రాలు కూడా మూసివేయబడతాయి. అవి సోమవారం (సెప్టెంబర్ 7) ఉదయం 8:30 గంటలకు తిరిగి ప్రారంభమవుతాయి. అలాగే, ఊంజల్ సేవ, బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను కూడా రద్దు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది.

సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు ఆలయాన్ని తెరిచి, శుద్ధి చేసిన తర్వాత సుప్రభాతంతో పూజలు ప్రారంభిస్తారు. అనంతరం పుణ్యాహవచనం నిర్వహిస్తారు. అయితే, ఆ సమయంలో తోమల సేవ, అర్చన వంటి సేవలు ఏకాంతంగా (ప్రైవేట్‌గా) నిర్వహిస్తారు.

సోమవారం (సెప్టెంబర్ 7) ఉదయం 6 గంటల నుండి భక్తులకు శ్రీవారి దర్శనానికి అనుమతి ఉంటుంది. భక్తులు ఈ మార్పులను గమనించి, సహకరించాలని టీటీడీ కోరింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad