AP weather updates:అమరావతి వాతావరణ శాఖ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్ జారీ చేసింది. ఏపీలో మరోసారి వర్షాలు పడనున్నట్టుగా పేర్కొంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చలితో జనాలు వణికి పోతున్నారు. ఇలాంటి తరుణంలో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక తీర ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడినట్లుగా పేర్కొంది. దీని ప్రభావంతో రేపు, ఎల్లుండి రెండు రోజుల పాటు ఏపీలో వర్షాలు పడతాయని స్పష్టం చేసింది. ముఖ్యంగా దక్షిణకోస్తాతో పాటు రాయలసీమకు భారీ నుంచి అతిభారీ వర్ష సూచన ఉన్నట్లు పేర్కొంది. తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో అధికారి వర్షాలు పడతాయని హెచ్చరికలు జారీ చేసింది. ప్రకాశం, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 55 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపారు.
చలి సైతం విపరీతం: వర్ష సూచనతో పాటుగా రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో చలి తీవ్రత విపరీతంగా పెరిగిపోయింది. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఏజెన్సీ వ్యాప్తంగా పొగ మంచు: గత కొన్ని రోజులుగా ఏజెన్సీ ప్రాంతాల ప్రజలు వణికిపోతున్నారు. ఏజెన్సీ వ్యాప్తంగా పొగ మంచు కమ్మేసింది. ప్రయాణికులు మంచు తెరలను చీల్చుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అయితే ఏజెన్సీ ప్రాంతాన్ని కమ్మేసిన మంచు అందాలు ఇక్కడకు వచ్చే పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. వంజంగిలోని మేఘాలకొండను చుట్టేసిన మంచు దృశ్యాలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. రాబోయే రోజుల్లో అరకు వంటి ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చస్తున్నారు. అరకు వంటి ప్రాంతాల్లో10 డిగ్రీల నుంచి 7డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు పడిపోయే ఛాన్స్ ఉందని అధికారులు వాతావరణ నిపుణులు తెలిపారు. అయితే మరికొన్నిచోట్ల మాత్రం 35 డిగ్రీలకు పైగా వేడి కొనసాగుతోంది. ఇక ఇప్పుడు రెండు రోజుల పాటు వర్షాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో రాష్ట్ర ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
Also Read: https://teluguprabha.net/andhra-pradesh-news/cold-weather-will-increases-in-andhra-pradesh/
జాగ్రత్తలు తప్పనిసరి: ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోయే అవకాశం ఉండడంతో ప్రజలకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, గుండె మరియు శ్వాస సంబంధ సమస్యలతో బాధపడేవారు రాత్రివేళల్లో బయటకు వెళ్లకుండా జాగ్రత్త పడాలని తెలిపింది. రాబోయే రోజుల్లో పలు ప్రాంతాల్లో తక్కువ ఉష్ణోగ్రతలు, పొగమంచు పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. దీంతో ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.


