Sunday, October 6, 2024
Homeఆంధ్రప్రదేశ్TTD EO Dharma Reddy: ప్రతి భక్తుడు మధుర స్మృతులతో తిరిగి వెళ్లాలి

TTD EO Dharma Reddy: ప్రతి భక్తుడు మధుర స్మృతులతో తిరిగి వెళ్లాలి

భక్తులే మా ఆరాధ్య దైవం అంటూ టీటీడీ ఉద్యోగులు అంకితభావంతో యాత్రికులకు సౌక‌ర్య‌వంత‌మైన సేవలందించాల‌ని ఈవో ఎవి.ధర్మారెడ్డి అన్నారు. తిరుమ‌ల గోకులం విశ్రాంతి గృహం ఆవరణలో 77వ స్వాతంత్ర దినోత్స‌వ‌ వేడుకల్లో పాల్గొన్న ఈవో జాతీయ జెండాను ఎగురవేసి వందనం చేశారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, ప్ర‌పంచం న‌లుమూలల‌ నుండి శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి విచ్చేసే భ‌క్తుల‌కు టీటీడీ ఉద్యోగులు అంకితభావంతో మ‌రింత మెరుగైన సేవ‌లందించి, ప్రతి భక్తుడు మధుర స్మృతులతో తిరిగి వెళ్లేలా చూడాలని పిలుపునిచ్చారు. శ్రీవారికి భక్తులు సమర్పించిన హుండీ కానుకలను లెక్కించేందుకు ఆల‌యం వెలుప‌ల నూతన పరకామణి భవనాన్ని అత్యాధునిక భద్రతతో ఏర్పాటుు చేసినట్లు చెప్పారు. శ్రీ‌వారి అనుగ్ర‌హంతో హుండీల‌ను సుల‌భంగా పరకామణి భవనంలోనికి త‌ర‌లిస్తున్న‌ట్లు తెలిపారు. ఇదివరకు ఆల‌యం లోప‌ల ప‌ర‌కామ‌ణి నిర్వ‌హిస్తున్న మండ‌పంలో వేలాది మంది భ‌క్తులు కూర్చుని స్వామివారిని ప్రార్థిస్తున్నార‌న్నారు. పరకామణిని మరింత సులభతరం చేసేందుకు కాయిన్స్ వేరుచేసే మిష‌న్‌, క‌రెన్సీ కౌంటింగ్‌, ప్యాకింగ్ మిష‌న్లు త్వ‌ర‌లోనే వ‌స్తాయ‌న్నారు. టీటీడీ అన్న‌దానం ట్ర‌స్టు ద్వారా ప్ర‌తి రోజు 2 ల‌క్ష‌ల మందికి పైగా భ‌క్తుల‌కు అన్న‌ప్ర‌సాదాలు అందిస్తున్నామ‌న్నారు. 1985వ సంత్స‌రంలో రెండు వేల మందితో ప్రారంభ‌మైన ఈ కార్య‌క్ర‌మం ఈ రోజు ఎంత‌మందికైన ప్రసాదాలు అందించేందుకు సిద్ధంగా ఉందన్నారు.

- Advertisement -

తిరుమ‌ల‌లో అతిథి గృహాల స్థ‌లం లీజుకు ఇచ్చే కార్యక్రమం ద్వారా ఐదు అతిథి గృహాల నిర్మాణం పూర్తి చేసి భక్తులకు అందుబాటు లోనికి తీసుకు వచ్చినట్లు తెలిపారు. తిరుమ‌ల‌లో వసతి గదులు నిర్మించి దాదాపు 40 సంవత్సరాలు అయ్యిందని రూ.120 కోట్లతో భక్తులకు అవసరమైన అత్యాధునిక సౌకర్యాలతో వీటిని ఆధునీకరించినట్లు తెలిపారు. తిరుమలలో మరో 10 వేల మంది శ్రీవారి భక్తులకు వసతి సౌకర్యాన్ని కల్పించేందుకు రూ.100 కోట్లతో పిఏసి 5 నిర్మాణం ప్రారంభించినట్లు చెప్పారు. ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుండి అలిపిరి శ్రీవారి మెట్టు మార్గాలలో నడిచి వెళ్లే భక్తులకు దివ్యదర్శనం టోకెన్లు జారీ చేసే ప్రక్రియ ప్రారంభించామన్నారు. నడక మార్గాల్లో క్రూరమృగాల వల్ల భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News