Saturday, November 23, 2024
Homeఆంధ్రప్రదేశ్Kautalam: తుంగభద్ర నదిపై వరద కాల్వను నిర్మించాలి

Kautalam: తుంగభద్ర నదిపై వరద కాల్వను నిర్మించాలి

టీడీపీ అధికారంలోకి వస్తే వరద కాల్వను నిర్మిస్తాం

తుంగభద్ర నదిపై వరద కాల్వను నిర్మిస్తే మంత్రాలయం, ఆదోని, ఎమ్మిగనూరు, కోడుమూరు నియోజకవర్గాలు సస్యశ్యామలమవుతాయని మంత్రాలయం నియోజకవర్గం టిడిపి ఇన్చార్జి తిక్కారెడ్డి అన్నారు. ఆయన మేలుగనూరులోని తుంగభద్ర నదిని పరిశీలించారు, వరద కాల్వ ద్వారా వచ్చిన నీటిని నిల్వ చేస్తే సుమారు 5నుంచి 10 టీఎంసీ నీటిని ఉపయోగించుకోవచ్చని తిక్కారెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తే వరద కాల్వను నిర్మించి పశ్చిమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు..

- Advertisement -

ఎగువన వేదావతి ప్రాజెక్టు నిర్మించి వరద నీరు, వేదావతి నీటిని అనునసంధానం చేసిపచ్చని భూములుగా మార్చి రెండు పంటలకు సాగునీటిని అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు రైతు రాష్ట్ర కార్యదర్శి అడివప్ప గౌడ్, టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు చెన్నబసప్ప, తెలుగు రైతు జిల్లా ప్రదాన కార్యదర్శి వెంకటపతి రాజు, జిల్లా కార్యదర్శి కోట్రేష్ గౌడ్, రమేష్ గౌడ్, వెంకటరెడ్డి, బిసి సెల్ జిల్లా కార్యదర్శి కురుగోడు, టి యన్ యస్ ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శివమూర్తి, యస్ సి సెల్ జిల్లా కార్యదర్శి రాజాబాబు, శివప్పగౌడ్ కావలి ఈరప్ప, ఓబులాపురం నరసింహులు, ఐ టిడిపి అధ్యక్షులు సల్మాన్ రాజు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News