Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Udhanam Kidney probs- permanent solution: ఉద్ధానం కిడ్నీ వ్యాధులకు శాశ్వత పరిష్కారం

Udhanam Kidney probs- permanent solution: ఉద్ధానం కిడ్నీ వ్యాధులకు శాశ్వత పరిష్కారం

ఉద్ధానం సమస్యలకు శాశ్వత పరిష్కారం

ఉద్దానం ప్రాంతంలో కళ్లెదుటే కిడ్నీ సమస్య కనిపిస్తున్నా గతంలో ఎవ్వరూ ఎప్పుడూ పరిష్కారం కోసం కనీసం ఆలోచించే సాహసం కూడా చేయని పరిస్థితిలో, ఏకంగా రూ.785 కోట్లు ఖర్చు చేసి మరీ.. ఉద్దానం వ్యాధిగ్రస్తుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించిన జగనన్న ప్రభుత్వం..

- Advertisement -

ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తుల సమస్యకు శాశ్వత పరిష్కారం అందిస్తూ..
పలాసలో డా. వైఎస్సార్ కిడ్నీ రీసెర్చ్ & సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్.. వైఎస్సార్ సుజలధార ప్రాజెక్ట్..ప్రారంభోత్సవం..

శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతాన్ని వేధిస్తున్న కిడ్నీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తూ రూ.700 కోట్ల వ్యయంతో నిర్మించిన వైఎస్సార్ సుజలధార ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తూ, అన్నిరకాల కిడ్నీ చికిత్సలతో పాటు కిడ్నీ వ్యాధిపై పరిశోధనలు చేసేందుకు వీలుగా రూ.85 కోట్ల వ్యయంతో నిర్మించిన డా. వైఎస్సార్ కిడ్నీ రీసెర్చ్ & 200 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను నేడు (14.12.2023) లాంఛనంగా ప్రారంభించనున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ. వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి..

డా. వైఎస్సార్ కిడ్నీ రీసెర్చ్ & 200 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ విశేషాలు..

ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తులకు మెరుగైన కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందించేందుకు మరియు కిడ్నీ వ్యాధులపై పరిశోధనలు చేసేందుకు రూ. 85 కోట్ల వ్యయంతో పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్, 200 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, డయాలసిస్ యూనిట్ల ఏర్పాటు.. మూడు బ్లాకులుగా 4 అంతస్తుల్లో ఆసుపత్రి నిర్మాణం. క్యాజువాలిటీ, రేడియో డయాగ్నోసిస్, పాథాలజీ, మైక్రో బయాలజీ, బయో కెమిస్ట్రీ ల్యాబ్స్, సెంట్రల్ ల్యాబ్స్, నెఫ్రాలజీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్, సర్జరీ, డయాలసిస్, పోస్ట్ ఆపరేటివ్/ఐసీయూ, రీసెర్చ్ ల్యాబ్ తో ప్రత్యేక వార్డులు…


సీటీ స్కాన్, 2డీ ఎకో, హై ఎండ్ కలర్ డాప్లర్, మొబైల్ ఎక్స్ రే (డిజిటల్), ధూలియం లేజర్ యూరో డైనమిక్ మిషన్ మొదలగు పరికరాలతో పాటు ఐసీయూ సౌకర్యాలు..
జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, యూరాలజీ, నెఫ్రాలజీ వంటి వివిధ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో ఇప్పటికే 42 స్పెషాలిటీ డాక్టర్ పోస్టులు, 60 స్టాఫ్ నర్సు పోస్టులు, 60 ఇతర సహాయ సిబ్బంది పోస్టుల భర్తీ కార్యక్రమం పూర్తి చేసిన జగనన్న ప్రభుత్వం..

వైఎస్సార్ సుజలధార ప్రాజెక్ట్ విశేషాలు

సిక్కోలు వాసుల చిరకాల వాంఛను నెరవేరుస్తూ ఉద్దానం ప్రాంతంలో
దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధులు (క్రానిక్ కిడ్నీ డిసీజెస్) ప్రబలంగా ఉన్న ఏడు మండలాల్లోని అన్ని గ్రామాలకు “వైఎస్సార్ సుజలధార” ప్రాజెక్టు ద్వారా శుద్ధి చేసిన రక్షిత తాగునీటి సరఫరా..
హీర మండలం రిజర్వాయర్ నుండి నీటిని తీసుకుని శుద్ధి చేసి పలాస, ఇచ్చాపురం నియోజకవర్గాల పరిధిలో 7 మండలాల్లోని 807 గ్రామాలకు రక్షిత నీటి సరఫరా..
ఈ ప్రాంతంలో ప్రస్తుతం ఉన్న 6.78 లక్షల జనాభా 2051 నాటికి 7.85 లక్షలకు చేరుతుందన్న అంచనాతో అప్పటి అవసరాలకు కూడా సరిపోయే విధంగా ఒక్కొక్కరికి రోజుకు 100 లీటర్ల చొప్పున నీరు సరఫరా చేసేలా ప్రాజెక్టు రూపకల్పన.. ఇప్పటికే 613 గ్రామాలకు నీటి సరఫరా.. ఈ నెలాఖరుకు మిగిలిన గ్రామాలకు సైతం నీటి సరఫరా…

ఉద్దానం కిడ్నీ బాధితులకు అండగా జగనన్న ప్రభుత్వం చేపట్టిన చర్యలు..

గత ప్రభుత్వంలో డయాలసిన్ పేషెంట్లకు కేవలం రూ.2,500 చొప్పున పెన్షన్ ఇస్తే మన జగనన్న ప్రభుత్వం ఏకంగా రూ.10వేలకు పెంచి. ప్రతి నెలా 1వ తేదీన ఠంఛన్ గా లబ్దిదారుల గుమ్మం వద్దనే వాలంటీర్లచే అందజేత.. ఇప్పటికే టెక్కలి, పలాస, సోంపేట, కవిటి, హరిపురం ఆస్పత్రుల్లో 74 మెషీన్లతో డయాలసిస్ సేవలు…
ఇలా వరుసగా 2019-20లో 37,454 సెషన్లు, 2020- 21లో 46,162 సెషన్లు, 2021-22లో 54,520 సెషన్లు, 2022-23లో 55,520 సెషన్లు, 2023-24 లో (అక్టోబర్ నాటికి) 38,513 సెషన్ల చొప్పున కిడ్నీ బాధితులకు డయాలసిస్ సేవలు అందించిన జగనన్న ప్రభుత్వం.. ఇప్పుడు దీనికి అదనంగా మరింత మెరుగైన సేవలు అందించేందుకు కిడ్నీ రీసెర్చ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్.


వైద్య పరీక్షల కోసం ఉద్దానం ప్రాంతంలోని 18 పీహెచ్ సీలు, 5 యూపీహెచ్ సీలు, 6 సీహెచ్ సీలలో సెమీ ఆటో ఎనలైజర్స్. ఎలక్ట్రోలైట్ ఎనలైజర్స్, యూరిన్ ఎనలైజర్స్ ఏర్పాటు.. గత ప్రభుత్వంలో డయాలసిస్ రోగులకు 20 రకాల మందులు మాత్రమే అరకొరగా అందజేస్తే.. ప్రస్తుతం ఇక్కడ ప్రతి ఆస్పత్రిలో 37 రకాల మందులు అందుబాటులో ఉంచిన జగనన్న ప్రభుత్వం.. కొత్త కేసుల గుర్తింపునకు నిరంతరాయంగా కొనసాగుతున్న స్క్రీనింగ్.. వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్ లో పనిచేసే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ (సీహెచ్ వో) లకు ప్రత్యేక యాప్..
స్క్రీనింగ్ అనంతరం అనుమానిత లక్షణాలున్న వారి నుంచి రక్త నమూనాలు సేకరించి సీరమ్ క్రియాటినిన్ పరీక్షల కోసం సమీపంలోని పీహెచ్ సీలకు తరలింపు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News