Monday, November 17, 2025
Homeఆంధ్రప్రదేశ్Vijay Paul: RRR కేసు.. నేడు కోర్టు ముందుకు మాజీ ఏఎస్పీ విజయ్ పాల్

Vijay Paul: RRR కేసు.. నేడు కోర్టు ముందుకు మాజీ ఏఎస్పీ విజయ్ పాల్

Vijay Paul| ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు(Raghurama Krishnaraju)పై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన కేసులో సీఐడీ(CID) మాజీ అడిషనల్ ఎస్పీ విజయ్ పాల్‌(Vijay Paul)ను ఒంగోలు పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. మంగళవారం రాత్రి 9 గంటలకు ఆయన్ను అరెస్ట్ చేసినట్లు ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ ప్రకటించారు. రాత్రి నుంచి ఒంగోలు తాలుకా పోలీస్ స్టేషన్‌లోనే ఉన్న విజయ్‌ పాల్‌ను కాసేపట్లో గుంటూరు కోర్టులో హాజరుపర్చనున్నట్లు తెలిపారు. 2021లో వైసీపీ ఎంపీగా ఉన్న రఘురామను అరెస్ట్ చేసిన సీఐడీ.. ఆయనను కస్టోడియల్ టార్చర్‌ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై RRR ఇటీవల గుంటూరు పోలీసులకు ఫిర్యాదుచేశారు. దీంతో కూటమి ప్రభుత్వం ఈ కేసు విచారణాధికారిగా ప్రకాశం జిల్లా ఎస్పీని నియమించింది.

- Advertisement -

ఈ కేసుకు సంబంధించి గతంలో విజయ్‌ పాల్‌ను ఎన్ని సార్లు విచారించినా తనకు ఏం గుర్తు లేదనే సమాధానమిచ్చారు. ఈ క్రమంలోనే ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే ఆయన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో మంగళవారం ఉదయం విచారణకు హాజరయ్యారు. సాయంత్రం వరకు విచారించిన ఎస్పీ దామోదర్.. రాత్రి 9 గంటల సమయంలో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad