Sunday, November 16, 2025
Homeఆంధ్రప్రదేశ్AP Free Bus Scheme: మహిళలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఇకపై ఫోన్లో ఆథార్...

AP Free Bus Scheme: మహిళలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఇకపై ఫోన్లో ఆథార్ చూపించినా ఉచిత ప్రయాణానికి ఓకే..!

AP Stree Shakti Scheme: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దసరా నవరాత్రుల సమయంలో మహిళలకు శుభవార్త చెప్పింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు పథకం స్త్రీ శక్తి ప్రయాణ సమయంలో మహిళలు తమ ఆథార్ కార్డు ఫొటోను ఫోన్ లో చూపించినా సరిపోతుందని కూటమి ప్రభుత్వం ప్రకటించింది. దీంతో మహిళలు తమతో పాటు గుర్తింపు కార్డును ఎల్లప్పుడూ క్యారీ చేయాల్సిన ఇబ్బంది నుంచి విముక్తి అందించబడింది.

- Advertisement -

ఉచిత బస్సు స్కీమ్ మహిళలకు ఆర్ధిక, సామాజిక వృద్ధికి దోహదపడుతుందని ప్రభుత్వం చెబుతోంది. స్కీమ్ కింద ఏపీ వ్యాప్తంగా ప్రతి మహిళ, బాలిక, ట్రాన్స్‌జెండర్ ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు అవకాశం ఇవ్వబడింది. ప్రస్తుతం ఇచ్చిన రిలీఫ్ ద్వారా పాత విధానంలో చెప్పినట్లుగా ఫిజికల్ కార్డు తప్పక ఉండనవసరం లేకుండా, డిజిటల్ ఆథరైజేషన్ కూడా అంగీకరించబడుతుంది. ఇది ప్రయాణాన్ని మరింత సులభతరం చేయనుంది. ఈ పథకంలో పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ వంటి ఏపీఎస్ ఆర్టీసీ బస్సు సేవలన్నీ ఉచితంగా అందుబాటులో ఉంటాయి.

స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలు విద్య, ఉద్యోగ, ఆరోగ్య సేవలకు, అలాగే సామాజిక కార్యకలాపాలకు సులభంగా చేరుకోవడానికి వీలు ఉంటుందని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. ఇదే సమయంలో మహిళల భద్రతను పెంచటానికి.. బస్సుల్లో సీసీ కెమెరాలు, కండక్టర్లకు బాడీ కెమెరాలు అమర్చుతూ సురక్షిత ప్రయాణం కోసం కూడా చర్యలు చేపడుతోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad