బనగానపల్లె మండలంలోని ప్రముఖ శైవ క్షేత్రమైన యాగంటి శ్రీ ఉమామహేశ్వర దేవస్థానంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడంతో క్షేత్రం కిటకటలాడింది. స్వామివారి పార్వేట ఉత్సవం కారణంగా ఉదయం దేవస్థానంలో శ్రీ ఉమామహేశ్వరస్వామి ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పల్లకిపై ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి పార్వేట ఉరేగింపునకు శ్రీకారం చుట్టారు. ఈ పార్వేట ఉత్సవం క్షేత్ర పరిధిలోని పాతపాడు, మీరాపురం, సాధకొట్టం, యాగంటి పల్లె గ్రామాల్లో సాగుతుంది. స్వామివారి పల్లకి ఊరేగింపుతో పార్వేట చేసి సాయంత్రానికి తిరిగి యాగంటి దేవస్థానం చేరుకోవడంతో ముగిసింది. బనగానపల్లె పట్టణంలోని కొండపేట శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం కమిటీ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాలను పల్లకిపై తీసుకువెళ్లి ఘనంగా పార్వేట ఉత్సవాలను నిర్వహించారు.
Yaganti: వైభవంగా యాగంటీశ్వరుని పార్వేట ఉత్సవం
సంబంధిత వార్తలు | RELATED ARTICLES