మహాశివరాత్రి ఉత్సవ ఉత్సవాల భాగంగా ఐదవ రోజున యాగంటి శ్రీ ఉమామహేశ్వర స్వామి శివదీక్ష విరమణ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. మండల, అర్ధమండల శివదీక్ష చేపట్టిన శివ స్వాములు తమ సమీపంలోని ఆలయాల్లో ఇరుమడి ధరించి పాదయాత్రగా బయలుదేరి యాగంటి ఉమామహేశ్వర స్వామి సన్నిధిలో ఇరుముడి దించి, మాలవిసర్జన చేసి శివదీక్ష విరమించారు. ఈ దీక్ష విరమణలో పాణ్యం ఎమ్మెల్యే, టిటిడి బోర్డు డైరెక్టర్, శివస్వామి దీక్షకు అంకురార్పణ చేసిన గురుస్వామి కాటసాని రాంభూపాల్ రెడ్డి పాతపాడు వద్ద దేవస్థానం ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరంలో ఇరుముడి ధరించి అక్కడి నుంచి పాదయాత్రగా యాగంటి క్షేత్రం చేరుకొని స్వామి సన్నిధిలో ఇరుముడిని దించి మాల విసర్జన చేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన పూర్ణాహుతి కార్యక్రమంలో కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆయన సతీమణి శ్రీమతి కాటసాని ఉమా మహేశ్వరమ్మ వారి తనయుడు కాటసాని శివ నరసింహరెడ్డిలు పాల్గొని పూజలు నిర్వహించారు. అనంతరం దీక్ష విరమణ చేసేందుకు విచ్చేసిన శివ స్వాములకు, వారి కుటుంబ సభ్యులకు, భక్తులకు కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించే శ్రీ ఉమామహేశ్వర నిత్య అన్నదాన సత్రంలో అన్నదాన వితరణ కావించారు.
Yaganti: భక్తి శ్రద్దలతో శివదీక్షా విరమణ
సంబంధిత వార్తలు | RELATED ARTICLES