మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బనగానపల్లె మండలంలోని యాగంటి శ్రీ ఉమామహేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాల రథోత్సవం వైభవంగా నిర్వహించారు. బనగానపల్లె ఎమ్మల్యే కాటసాని రామిరెడ్డి తేరు ఉత్సవంలో పాల్గొని వివిధ రథోత్సవ క్రతువుల్లో పాల్గొని పూజలు నిర్వహించి రథాన్ని లాగారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ రథ సేవలో పాల్గొన్నారు.
యాగంటి శ్రీ ఉమామహేశ్వర స్వామి మండల, అర్ధ మండల, ఏకదశాహ్నికమ్ కాలం మాలాదీక్షధారణ చేసి నియమనిష్ఠలతో దీక్షపాటించిన శివస్వాముల దీక్షవిరమణ మంగళవారం ఉదయం నుంచి ప్రారంభం కానుంది.


