Sunday, November 16, 2025
Homeఆంధ్రప్రదేశ్AP Assembly: కుప్పం ఎమ్మెల్యే అంటూ సీఎంను సంభోదించిన వైసీపీ ఎమ్మెల్సీ.. సభలో గందరగోళం

AP Assembly: కుప్పం ఎమ్మెల్యే అంటూ సీఎంను సంభోదించిన వైసీపీ ఎమ్మెల్సీ.. సభలో గందరగోళం

YCP MLC Ramesh Yadav Comments: ఏపీ అసెంబ్లీ సమావేశాలు హాట్‌హాట్‌గా జరుగుతున్నాయి. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల ముందు కూటమి సర్కారు ఇచ్చిన సూపర్‌ సిక్స్‌ హామీలపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఏపీ శాసన మండలిలో తీవ్ర గందరగోళం నెలకొంది. హామీలు అమలు చేయకుండానే సూపర్‌ హిట్‌ అంటూ కూటమి సర్కారు మోసగిస్తోందని వైకాపా సభ్యుడు రమేశ్‌ యాదవ్‌ ఆరోపించగా మంత్రులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. హామీల అమలును జీర్ణించుకోలేకే వైసీపీ నేతలు కడుపుమంటతో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. సుదీర్ఘ కాలం సీఎంగా పనిచేసిన చంద్రబాబును సీఎం అని కాకుండా కుప్పం ఎమ్మెల్యే అంటూ సంబోధించిన వైకాపా ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్‌ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. వైసీపీ ఎమ్మెల్సీ రమేష్‌ యాదవ్‌ సీఎంను కుప్పం ఎమ్మెల్యే అని మాట్లాడారని మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రికార్డులను పరిశీలించి ఆయనపై చర్యలు తీసుకోవాలని మండలి ఛైర్మన్‌ను కోరారు. సీఎంను అగౌరవపరిచినందుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. సీఎం సభా నాయకుడు.. ఆ విషయాన్ని వైసీపీ సభ్యుడు ఎలా మర్చిపోతారని మంత్రి నాదెండ్ల మనోహర్‌ నిలదీశారు.

- Advertisement -

Also Read: https://teluguprabha.net/gallery/dont-not-eat-these-fruits-at-all-if-you-want-to-loss-weight/

రమేశ్‌ యాదవ్‌ వ్యాఖ్యలపై సభ్యుల ఆగ్రహం..

సభలో పరిణామాలు సభా సంప్రదాయాలకు విరుద్ధంగా ఉన్నాయని మండలి ఛైర్మన్‌ మోషేనురాజు అన్నారు. జరిగిన పరిణామాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించినట్లు తెలిపారు. సభ్యుడు రమేశ్‌ యాదవ్‌ మాటలు అభ్యంతరకరంగా ఉన్నాయన్నారు. ఆయన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తామన్నారు. పెద్దల సభలో సభ్యులు హుందాగా వ్యవహరించాలని కోరారు. అయితే, ఈ తరుణంలో రమేష్‌ యాదవ్‌ వ్యాఖ్యలను వైసీపీ సీనియర్‌ నేత బొత్స సమర్థించారు. ఎన్నికల మ్యానిఫెస్టోను ప్రకటించిన అనాటి కుప్పం ఎమ్మెల్యే అని మాత్రమే అన్నాం. ఇప్పుడున్న ముఖ్యమంత్రిని పట్టుకుని కుప్పం ఎమ్మెల్యే అనలేదు. అందులో తప్పేముంది?. కావాలంటే ఆయన వ్యాఖ్యలపై రికార్డులు పరిశీలించుకోవాలి. అని అన్నారు. ఈ తరుణంలో మండలి చైర్మన్‌ కొయ్యే మోషేన్‌రాజు కలుగజేసుకున్నారు. రమేష్‌ యాదవ్‌ వ్యాఖ్యాలను రికార్డుల నుంచి పరిశీలించి నిర్ణయం తీసుకుంటానని చెప్పి సూపర్‌ సిక్స్‌పై స్వల్పకాలిక చర్చను రేపటికి వాయిదా వేశారు. సభా మర్యాద పాటించేలా మండలి సభ్యులు వ్యవహరించాలని, కొందరు సభ్యులు, మంత్రులు మాట్లాడిన మాటలు రికార్డుల నుండి తొలగిస్తామని చెప్పారు. రేపు వ్యవసాయంతో పాటు సూపర్‌ సిక్స్‌ అంశాలు చర్చించాలని మండలి ఛైర్మన్‌ నిర్ణయించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad