Monday, November 17, 2025
Homeఆంధ్రప్రదేశ్YS Jagan| అదానీ లంచం ఆరోపణలపై జగన్ ఏమన్నారంటే..?

YS Jagan| అదానీ లంచం ఆరోపణలపై జగన్ ఏమన్నారంటే..?

YS Jagan: ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ(Adani)తో జరిగిన విద్యుత్‌ కొనుగోలులో వైసీపీ అధినేత జగన్ రూ.1,700 కోట్లు అవినీతికి పాల్పడ్డారంటూ అమెరికా అధికారులు చేసిన ఆరోపణలపై తొలిసారి జగన్‌ స్పందించారు. తనకు లంచం ఇవ్వబోయినట్లు ఎక్కడైనా ఆధారాలున్నాయా అని ప్రశ్నించారు. ఎఫ్‌బీఐ(FBI) ఛార్జిషీట్‌లో తన పేరు ఎక్కడా లేదని స్పష్టం చేశారు. తనపై అసత్య ప్రచారం చేస్తున్న వారిపై రూ.100కోట్లు పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు.

- Advertisement -

2021లో కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో సెకీతో 9వేల మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ కొనుగోలుకు చర్చలు జరిగాయని వివరించారు. యూనిట్‌కు రూ. 2.49పైసలకు సెకీతో 25 ఏళ్ల పాటు ఒప్పందం జరిగిందన్నారు. అంతకుముందు రూ.5.10పైసలకు కొన్న విద్యుత్‌ను తాము రూ. 2.49పైసలకు కొనుగోలు చేశామని పేర్కొన్నారు. దీంతో పాటు ఇంటర్‌స్టేట్‌ ట్రాన్స్‌మిషన్‌ ఛార్జెస్‌ కింద కేంద్రం ప్రత్యేక ప్రోత్సహకాలు ఇస్తామని సెకీ ఆఫర్‌ ఇచ్చిందని పేర్కొన్నారు. ఈ ఒప్పందం వల్ల లక్ష కోట్ల రూపాయలు ఆదాయం జరిగితే ఎవరైనా వద్దంటారా? అని ప్రశ్నించారు. రూ. లక్ష కోట్లు ఆదా చేయడం సంపద సృష్టి కాదా..? అని అన్నారు. తాను సంపద సృష్టిస్తే చంద్రబాబు(CM Chandrababu) ఆవిరి చేశారని విమర్శించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad