Wednesday, December 18, 2024
Homeఆంధ్రప్రదేశ్YS Sharmila: రాజ్యాంగంపై బీజేపీ దాడి.. జమిలి ఎన్నికల బిల్లుపై షర్మిల విమర్శలు

YS Sharmila: రాజ్యాంగంపై బీజేపీ దాడి.. జమిలి ఎన్నికల బిల్లుపై షర్మిల విమర్శలు

జమిలి ఎన్నికల బిల్లుపై ఏపీసీసీ(APCC) చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) తీవ్ర విమర్శలు చేశారు. దేశంలో బీజేపీ రాజ్యాంగం అమల్లోకి తెచ్చేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా స్పందించారు.

- Advertisement -

“భారత రాజ్యాంగంపై బీజేపీ దాడి జరుగుతూనే ఉంది. బాబాసాహెబ్ డాక్టర్. అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి తూట్లు పొడిచి బీజేపీ రాజ్యాంగం అమల్లోకి తెచ్చేందుకు కుట్రలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే జమిలి ఎన్నికల బిల్లులను బీజేపీ లోక్‌సభలో ప్రవేశపెట్టింది. పూర్తి మెజార్టీ లేకపోయినా రాజ్యాంగ వ్యతిరేకంగా బిల్లులను ప్రవేశపెట్టడం బీజేపీ నిరంకుశ విధానానికి నిదర్శనం. ఇది ఫక్తు నియంతృత్వ చర్య . సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్న ఈ బిల్లును కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. రాజ్యాంగ సవరణలకు కావాల్సిన మూడింట రెండొంతుల మెజారిటీ బీజేపీకి లేదని లోక్‌సభలో ఓటింగ్‌తో తేలింది. కేంద్రంలో ప్రభుత్వం పడిపోతే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎందుకు కుప్పకూలాలి..? ఇందులో ఏమన్నా అర్థముందా..? సభలో రాజ్యాంగాన్ని ఖూనీ చేసేందుకు మోదీ సర్కారు ప్రయత్నించింది. చివరకు ఓటింగ్‌ వ్యవహారం బీజేపీకే బెడిసికొట్టింది.

రాజ్యాంగంలోని ఇటువంటి కీలకాంశాలను సవరించే అధికార పరిధి పార్లమెంటుకు లేదు. జమిలి ఎన్నికలు జరపాలంటే కేంద్ర, రాష్ట్రాల చట్టసభలకు నిర్ణీత కాల వ్యవధి కల్పించే ఆర్టికల్ 83, 172లను కూడా సవరించాల్సి ఉంటుంది. అసెంబ్లీల గడువును లోక్‌సభతో ముడిపెట్టడం ప్రజా తీర్పును అపహాస్యం చేయడమే. తమకు నచ్చిన ప్రభుత్వాన్ని ఐదేళ్ల కాలానికి ఎన్నుకునే హక్కు ప్రజలకు ఉంటుంది. జమిలి ద్వారా దానికి గండికొట్టే అధికారం కేంద్రానికి లేదు. దేశంలో నియంతృత్వాన్ని తీసుకురావడమే బీజేపీ ఉద్దేశం. రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరించే జమిలి ఎన్నికల బిల్లుల ఆమోదానికి కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో సహకరించదు” అని ట్వీట్ చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News