Sunday, November 16, 2025
Homeఆంధ్రప్రదేశ్Ysrcp Mla : జగన్‌ను వీడటంపై క్లారిటీ ఇచ్చిన వైసీపీ ఎమ్మెల్యే

Ysrcp Mla : జగన్‌ను వీడటంపై క్లారిటీ ఇచ్చిన వైసీపీ ఎమ్మెల్యే

Jagan: ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్సీలు వైసీపీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరగా, తాజాగా అరకు ఎమ్మెల్యే మత్స్యలింగం వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. ఈ పరిణామాలు వైసీపీకి పెద్ద షాక్‌గా మారాయి.

- Advertisement -

ఎమ్మెల్సీల రాజీనామా..
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో భారీ ఓటమితో కుదేలైన వైసీపీకి సొంత పార్టీ నాయకుల నుంచి ఊహించని షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే ఎమ్మెల్సీలు మర్రి రాజశేఖర్, కర్రి పద్మశ్రీ, బల్లి కళ్యాణ చక్రవర్తి తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరి చేరిక వైసీపీని మరింత బలహీనపరిచింది. సరిగ్గా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే వీరు పార్టీ మారడం చర్చకు దారితీసింది. ఇదే క్రమంలో, ఉత్తరాంధ్రకు చెందిన ఒక వైసీపీ ఎమ్మెల్యే కూడా పార్టీ మారతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది.

అరకు ఎమ్మెల్యే వ్యవహారం
కూటమి ప్రభంజనాన్ని తట్టుకుని వైసీపీ నుంచి గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలలో అరకు ఎమ్మెల్యే మత్స్యలింగం ఒకరు. అయితే ఆయన వ్యవహార శైలిపై గత కొంతకాలంగా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా, రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ కాలేజీలపై వైసీపీ నిర్వహించిన నిరసన కార్యక్రమానికి అరకు ఎమ్మెల్యే మత్స్యలింగం హాజరు కాకపోవడం ఈ ప్రచారానికి మరింత బలం చేకూర్చింది. విశాఖ, అనకాపల్లి, అల్లూరి జిల్లాల నుంచి వైసీపీ నాయకులంతా హాజరైనప్పటికీ, పక్కనే ఉన్న మత్స్యలింగం దూరంగా ఉండడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. దీంతో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశం ఉందన్న వార్తలు వస్తున్నాయి.

టీడీపీ వ్యూహం
అరకు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి చివరిసారిగా 2009లో విజయం లభించింది. ఆ తర్వాత మూడు ఎన్నికల్లోనూ టీడీపీ ఓడిపోయింది. ఈ నేపథ్యంలో, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ నియోజకవర్గంపై పట్టు సాధించేందుకు టీడీపీ అరకు ఎమ్మెల్యేను పార్టీలోకి చేర్చుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం టీడీపీ హైకమాండ్‌తో మత్స్యలింగం టచ్‌లో ఉన్నారని, అందుకే ఆయన వైసీపీ నిరసనలకు దూరంగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది.

జగన్‌తోనే ఉంటా: అరకు ఎమ్మెల్యే మత్స్యలింగం
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి తాను తెలుగుదేశం పార్టీలో చేరుతున్నానంటూ జరుగుతున్న ప్రచారంపై అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం తీవ్రంగా స్పందించారు. తనపై జరుగుతున్న ప్రచారం అవాస్తవమని, తన ‘కట్ట కాలేవరకూ జగన్‌తోనే ఉంటా’ అని ఆయన స్పష్టం చేశారు. పార్టీ మారడం అనేది తన కలలో కూడా లేని విషయమని తేల్చి చెప్పారు.

వైసీపీలో తనకు లభించిన గౌరవాన్ని తాను ఎప్పటికీ మర్చిపోలేనని, తన రాజకీయ ఎదుగుదలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డినే కారణమని మత్స్యలింగం అన్నారు. తనపై తప్పుడు ప్రచారాలు చేయిస్తున్నారని, ఇందులో భాగంగానే మెడికల్ కాలేజీల నిరసన కార్యక్రమంలో తాను పాల్గొనలేదని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

 

Hyderabad: నాణెం తీయబోయి.. ప్రాణాలు తీసిన వైద్యులు

తాను అవసరమైతే రాజకీయాలు వదిలేస్తాను కానీ, వైసీపీని వీడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. తనతో పాటు తన కుటుంబ సభ్యులు కూడా వైసీపీలోనే కొనసాగుతారని తేల్చి చెప్పారు. తనపై కొంతమంది కూటమి నేతలు కావాలనే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని ఆయన ఖండించారు. తాను పార్టీకి కట్టుబడి ఉంటానని, జగన్ ఇచ్చిన గౌరవాన్ని నిలబెట్టుకుంటానని మత్స్యలింగం వివరించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad