Friday, November 22, 2024
Homeఆంధ్రప్రదేశ్YSR Law Nestham funds released: 'వైఎస్సార్ లా నేస్తం' నిధుల విడుదల

YSR Law Nestham funds released: ‘వైఎస్సార్ లా నేస్తం’ నిధుల విడుదల

యువ న్యాయవాదులకు తొలి 3 సంవత్సరాలు అండగా ఉంటూ..

రాష్ట్రవ్యాప్తంగా 2,807 మంది అర్హులైన జూనియర్ న్యాయవాదులకు నెలకు రూ. 5,000 స్టైఫండ్ చొప్పున జులై, 2023 డిసెంబర్, 2023 (6 నెలలు) కు ఒక్కొక్కరికి రూ. 30,000 ఇస్తూ, మొత్తం రూ. 7,98,95,000 ను సీఎం క్యాంప్ కార్యాలయంలో బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమ చేశారు ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి..

- Advertisement -

కొత్తగా లా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన యువ లాయర్లు వృత్తిలో నిలదొక్కుకునేలా 3 ఏళ్ల పాటు ఒక్కొక్కరికి ఏడాదికి రూ.60,000 చొప్పున రెండు దఫాల్లో చెల్లిస్తూ, మూడేళ్లకు మొత్తం రూ.1,80,000 స్టైఫండ్ అందిస్తున్న జగనన్న ప్రభుత్వం..

నేడు అందిస్తున్న సాయంతో కలిపి ఇప్పటివరకు 6,069 మంది యువ న్యాయవాదులకు ఈ నాలుగున్నరేళ్లలో అందించిన మొత్తం ఆర్థిక సాయం రూ. 49.51 కోట్లు

న్యాయవాదుల సంక్షేమం కోసం అడ్వకేట్ జనరల్ ఆధ్వర్యంలో లా, ఫైనాన్స్ సెక్రటరీలు సభ్యులుగా రూ.100 కోట్లతో “అడ్వకేట్స్ వెల్ఫేర్ ట్రస్ట్” ను ఏర్పాటు చేసి, న్యాయవాదుల అవసరాలకు రుణాలు, గ్రూప్ మెడిక్లెయిమ్ పాలసీలు, ఇతర అవసరాలకోసం ఈ ట్రస్ట్ ద్వారా ఇప్పటికే రూ. 25 కోట్ల ఆర్థిక సాయం అందించిన జగనన్న ప్రభుత్వం..

ఈ ట్రస్ట్ నుంచి ఆర్థిక సాయం కోరే అడ్వకేట్స్ ఆన్ లైన్ లో [email protected] లేదా నేరుగా లా సెక్రటరీకి అప్లై చేసుకోవాలి.

“వైఎస్సార్ లా నేస్తం” పథకానికి సంబంధించి ఏ రకమైన ఇబ్బందులున్నా జగనన్నకు చెబుదాం 1902 టోల్ ఫ్రీ నంబర్

మరింత సమర్థవంతంగా పథకాన్ని మానిటర్ చేసేలా.. ఏక కాలంలో యువ న్యాయవాదులు పెద్ద మొత్తం సొమ్ము అందుకుని వారి అవసరాలు తీర్చుకునేందుకు మరింత ఉపయోగపడేలా.. ప్రతి ఆరు నెలలకోసారి బటన్ నొక్కి లబ్ది అందిస్తున్న జగనన్న ప్రభుత్వం..

పథకానికి అప్లై చేసుకోదలిచిన వారు https://ysrlawnestham.ap.gov.in వెబ్ సైట్ లో తమ పేరును నమోదు చేసుకుని బ్యాంకు అకౌంట్, ఆధార్ నంబర్ ను పొందుపరిచి సర్టిఫికెట్స్ అప్లోడ్ చేయాలి..

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News