దేశానికే ఆదర్శంగా అన్నదాతలను అన్ని విధాలుగాచేయిపట్టుకు నడిపిస్తూ.. ఎన్ని కష్టాలు ఎదురైనా… చెప్పిన సమయానికి చెప్పినట్లుగా రైతన్నల సంక్షేమానికి గతంలో ఎన్నడూ జరగని విధంగా రైతు భరోసా కల్పిస్తూ వ్యవసాయాన్ని పండగ చేసిన జగనన్న ప్రభుత్వం.
రైతన్నలకు ఒక్కొక్కరికి ఏటా రూ.13,500 చొప్పున వరుసగా 4 ఏళ్లు రైతు భరోసా– పీఎం కిసాన్ సాయం అందించడంతో పాటు ఐదో ఏడాది ఇప్పటికే రెండు విడతల్లో ఒక్కొక్కరికి అందించిన సాయం రూ.11,500, మూడోవిడతగా ఒక్కొక్కరికి మరో రూ.2,000 చొప్పున 53.58 లక్షల మంది రైతన్నలకు రూ.1,078.36 కోట్లను జమ చేసే కార్యక్రమాన్ని క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించిన సీఎం శ్రీ వైయస్.జగన్.
వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఏపీ అగ్రిమిషన్ వైస్ చైర్మన్ ఎం వీ యస్ నాగిరెడ్డి, వ్యవసాయశాఖ సలహాదారు ఐ తిరుపాల్ రెడ్డి, ఉద్యానవనశాఖ సలహాదారు పి శివప్రసాద్‌రెడ్డి, సీఎస్ డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ గోపాలకృష్ణ ద్వివేది, వ్యవసాయశాఖ స్పెషల్ కమిషనర్ సి హరికిరణ్, ఉద్యానవనశాఖ కమిషనర్ డాక్టర్ ఎస్ ఎస్ శ్రీధర్, ఇతర ఉన్నతాధికారులు, వివిధ బ్యాంకుల ప్రతినిధులు హాజరు.