Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్YSR Yantra Seva: ఘనంగా వైఎస్ఆర్ యంత్ర సేవా మేళా

YSR Yantra Seva: ఘనంగా వైఎస్ఆర్ యంత్ర సేవా మేళా

పేద, చిన్న-సన్నకారు రైతులకు సాంకేతికంగా అండగా నిలిచి, వ్యవసాయ దిగుబడిని పెంచేందుకు ఆంధ్రప్రదేశ్ సర్కారు అందిస్తున్న వినూత్న సాయమే వైఎస్ఆర్ యంత్ర సేవా. యంత్ర సేవా మేళాలో భాగంగా రైతన్నకు అండగా ఉండేలా వైఎస్ఆర్ యంత్ర సేవా మేళా పథకాన్ని అందుబాటులోకి తెచ్చినట్టు సీఎం జగన్ వెల్లడించారు. తక్కువ ధరకే యంత్ర పనిముట్లు అందేలా చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించిన సీఎం.. 13,573 యంత్ర పనిముట్లను పంపిణీ చేశారు. గుంటూరులోని చుట్టగుంటలో జరిగిన ఈ మేళాను జెండా ఊపి సీఎం ప్రారంభించారు.

- Advertisement -

వైఎస్సార్ యంత్రసేవా పథకం – రాష్ట్ర స్థాయి రెండో మెగా మేళా సందర్భంగా ట్రాక్టర్లు, కంబైన్ హార్వెస్టర్లు, ఇతర వ్యవసాయ పనిముట్లను ఆయన పంపిణీ చేశారు. రాష్ట్ర స్ధాయి రెండో మెగా పంపిణీలో భాగంగా రూ.361.29 కోట్ల విలువ గల 2,562 ట్రాక్టర్లు, 100 కంబైన్‌ హార్వెస్టర్లు, 13,573 ఇతర వ్యవసాయ పనిముట్లను గుంటూరు నగరంలోని చుట్టుగుంట సర్కిల్‌లో పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా జెండా ఊపి ప్రారంభించిన ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌. రూ.125.48 కోట్ల సబ్సిడీ సొమ్మను కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి నేరుగా రైతన్నల గ్రూపుల బ్యాంకు ఖాతాల్లోకి విడుదల చేసిన సీఎం. అనంతరం రైతులనుద్దేశించి మాట్లాడిన ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ఏమన్నారంటే..:

ప్రతి ఆర్బీకే పరిధిలో అందుబాటులో వ్యవసాయ పరికరాలు
ప్రతి ఆర్బీకే పరిధిలో ఒక కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్‌ కింద రైతులకు కావాల్సిన ట్రాక్టర్లు, వ్యవసాయ పరికరాలును అందుబాటులో తీసుకువస్తున్నాం.ఆ ఆర్బీకే పరిధిలో ఉన్న రైతులే ఒక గ్రూపు కింద ఏర్పడి.. ఒక కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్‌ కింద తీసుకుని వచ్చి, ఆ ఆర్బీకే పరిధిలో ఉన్న మిగిలిన రైతులందరికీ కూడా తక్కువ ధరకు ఈ యంత్రాలన్నింటినీ అందుబాటులోకి తీసుకుని వచ్చే గొప్ప కార్యక్రమానికి మనం శ్రీకారం చుట్టాం.

గ్రామ స్వరాజ్యనికి నిజమైన అర్ధం..
దేవుడి దయతో ఈ రోజు మనం చేసే ఈ కార్యక్రమంతో పూర్తిగా 10,444 ఆర్బీకేల పరిధిలోనూ ఇక మీదట కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్ల పేరుతో ఆర్బీకేలతో అనుసంధానమై, దాని పరిధిలోని రైతన్నలే.. ట్రాక్టర్లతో కూడిన వ్యవసాయ పనిముట్లన్నీ కూడా అతితక్కువ ధరకు మిగిలిన రైతులకు అందుబాటులోకి తీసుకునివస్తారు. గ్రామస్వరాజ్యం అనే పదానికి నిజమైన అర్ధం చెప్పే రోజుది.

ఇంతకముందు మనం 6,525 ఆర్బీకే స్ధాయిలోనూ 391 క్లస్టర్‌ స్థాయిలోనూ కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్లు రైతులు పేరుతో ప్రారంభించాం. వాటి పరిధిలో 3,800 ట్రాక్టర్లను, 391 కంబైన్‌ హార్వెస్టర్లను, 22,580 ఇతర యంత్రాలను, వ్యవసాయ పనిముట్లను పంపిణీ చేశాం.

ఈ రోజు చేస్తున్న కార్యక్రమం ద్వారా మిగిలిన మరో 3,919 ఆర్బీకేల స్ధాయిలోనూ, మిగిలిన 100 క్లస్టర్‌ స్ధాయి కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్లు అన్నింటిలోనూ… 2,562 ట్రాక్టర్లును, 100 కంబైన్‌ హార్వెస్టర్లతో పాటు 13,573 ఇతర యంత్రాలను ఈరోజు అందుబాటులో ఉండేటట్టుగా ఈ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభిస్తున్నాను.

ప్రతి ఆర్బీకే స్ధాయిలోనూ రూ.15 లక్షలు కేటాయించి, అక్కడ ఎటువంటి యంత్రాలు కావాలని రైతులనే నిర్ణయించుకోమని చెప్పి, వాళ్ల నిర్ణయం ప్రకారం రూ.15 లక్షల మేరకు ఆ యంత్రసేవలన్నీ వారి అవసరాలమేరకు తీసుకుని వస్తున్నాం. అదే విధంగా 491 క్లస్టర్‌ స్ధాయిలో వరి బాగా పండుతున్నచోట.. కంబైన్‌ హార్వెస్టర్లు తీసుకునిరావాల్సిన అవసరం ఉందనిపించి 491 క్లస్టర్లను గుర్తించాం. అక్కడ ఒక్కో క్లస్టర్‌ స్ధాయిలో ఒక్కో హార్వెస్టర్‌ను రూ.25 లక్షల వ్యయంతో రైతులకు అందుబాటులోకి తీసుకువస్తున్నాం. ఈ రకంగా రూ.1052 కోట్ల ఖర్చుతో ఆర్బీకేల పరిధిలో వీటిని తీసుకునివస్తున్నాం.

గ్రూపులుగా ఏర్పడిన రైతులు కేవలం 10 శాతం డబ్బులు కడితే చాలు, 40 శాతం ప్రభుత్వమే సబ్సిడీ కింద ఇస్తుంది. మిగిలిన 50 శాతం రుణాల కింద ఆ ఆర్బీకే పరిధిలో ఉన్న రైతులకు అందుబాటులోకి తీసువస్తున్నాం.

రైతుల కోసం వైఎస్‌ఆర్‌ యంత్రసేవ యాప్‌.
ఆ ఆర్బీకే స్ధాయిలోనే ఏ రైతు అయినా వీటిని వాడుకునేందుకు, ఉపయోగకరంగా ఉండేందుకు అతి తక్కువ అద్దెతో వారికి అందుబాటులోకి ఉండేందుకు వాళ్లకోసం వైఎస్‌ఆర్‌ యంత్రసేవ యాప్‌ను కూడా అందుబాటులోకి తీసుకుని వస్తున్నాం. ఈ యాప్‌ సహాయంతో 15 రోజుల ముందుగానే వ్యవసాయ ఉపకరణాలను బుక్‌ చేసుకోవచ్చు. వీటన్నింటి వల్ల రైతులకు మంచి జరగాలని ఆ ఆర్బీకే పరిధిలో ఉన్న ప్రతి రైతు వీటిని ఉపయోగించుకునే పరిస్థితి రావాలని మనసారా కోరుకుంటూ, వారికి మంచి జరగాలని కోరుకుంటున్నాను.

అక్టోబరులో 7 లక్షల మంది రైతులకు మేలు చేసేలా..
అదే విధంగా ఈ సంవత్సరమే మరలా అక్టోబరు నెలలో 7 లక్షల మంది రైతులకు మంచి చేస్తూ.. స్పేయర్లు, టార్ఫాలిన్లు, వీడర్లు వంటి వ్యక్తిగత వ్యవసాయ పనిముట్లును నిరుపేదలైన ఆ రైతులకు పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. ఆర్బీకే వ్యవస్ధను పటిష్టం చేస్తూ.. రైతులకు ఇంకా మంచి చేయాలన్న తపనతో ఈ అడుగులు వేస్తున్నాం.

ఈ కార్యక్రమం ద్వారా రైతులకు ఇంకా మంచి జరగాలని.. దేవుడి దయ, ప్రజలందరి చల్లని ఆశీస్సులతో ఇంకా మంచి చేసే అవకాశం దేవుడి ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నాను అని సీఎం ప్రసంగం ముగించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News