Wednesday, April 2, 2025
Homeఆంధ్రప్రదేశ్Yuvagalam: కుప్పం నుంచి లోకేష్ పాదయాత్ర 'యువగళం', 400 రోజులు, 4000 km

Yuvagalam: కుప్పం నుంచి లోకేష్ పాదయాత్ర ‘యువగళం’, 400 రోజులు, 4000 km

తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్రకు సర్వం సిద్ధమైంది. యువగళం పేరుతో లోకేశ్ రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడు వివరించారు. జనవరి 27 నుంచి లోకేశ్ యువగళం యాత్ర 400 రోజులపాటు 4000 కిలోమీటర్ల మేర సాగనుంది. చిత్తూరు జిల్లాలోని సొంతూరు కుప్పం నుంచి లోకేశ్ యాత్ర ప్రారంభమయ్యే యాత్ర ఎటువంటి హంగూ ఆర్భాటం లేకుండా ఉంటుందని, త్వరలో రోడ్ మ్యాప్ ప్రకటిస్తామని టీడీపీ తెలిపింది. పాదయాత్రలో అడుగడుగునా ప్రజా సమస్యలు తెలుసుకుని, వైసీపీ సర్కారు వైఫల్యాలను వివరించే వేదికగా ఈ యాత్ర ఉండనుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News