Bigg Boss: బిగ్‌బాస్ హౌస్ కెప్టెన్‌గా డీమాన్ పవన్ అయ్యాడు. రీతూ కోరింది.. వెంటనే పవన్ కెప్టెన్ అయ్యాడు. అయితే, పవన్ కెప్టెన్ ఎలా అయ్యాడనే విషయంపై మాత్రం గట్టిగానే చర్చ జరుగుతుంది. పన్‌ని కెప్టెన్ చేసేందుకు రీతూ చౌదరి సంచాలక్‌గా ఫెయిల్ అయిందంటూ ఆడియన్స్ కామెంట్లు పెడుతున్నారు. ఇక ఈ టాపిక్‌పై కంటెస్టెంట్ల మధ్య కూడా చర్చ జరిగింది. అందుకు సంబంధించిన ప్రోమోని తాజాగా వదిలారు. అందులో నువ్వు కావాలనే డీమాన్‌కి ఇచ్చావని బయటికి ఏమనలేదు కదా అని రీతూని ప్రియని ప్రశ్నించింది. దీనికి కావాలనే వీళ్లిద్దరూ ఆడారు కదా గేమ్.. దాన్ని బట్టే నేను ఇచ్చాను కదా.. అంటూ రీతూ తనని తాను సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడింది. ఇంతలో ఇద్దరు కలిసి నా మీద అటాక్ చేశారు.. రెండో విషయం ఇమ్మూ అసలు డిఫెండ్ లోనే ఉన్నాడు అటాక్‌యే చేయలేదు.. ఆ ప్లేట్ పక్కనే కూర్చున్నాడు.. అంటూ డీమాన్ మాట్లాడాడు.
భరణి, ఇమ్మూ అన్ ఫెయిర్ గేమ్ అంట..
మరోవైపు మర్యాద మనీష్ కూడా కామనర్లతో కెప్టెన్సీ గేమ్ గురించి చర్చించాడు. నేను ప్లేట్ తన్నడానికి రీజన్ అదే.. ఆయన సీదా మనీష్‌ని అటాక్ చేయని అన్నాడు.. అప్పుడు మేము ఇద్దరం ఏమనుకున్నామంటే భరణిని అటాక్ చేద్దామని అనుకున్నాం.. అని మనీష్ చెప్పాడు. భరణి గారు అన్‌ఫెయిర్ ఆడుతున్నారని క్లియర్‌గా తెలుస్తుంది.. అంటూ ప్రియ మధ్యలో మాట్లాడింది. ఇమ్మానుయేల్ కూడా అన్‌ఫెయిర్ ఆడుతున్నాడు కదా భరణి గారిని చూసి కూడా కొట్టట్లేదు.. అంటూ ప్రియ చెప్పుకొచ్చింది.
ఎమోషనల్ అయిన ఇమ్మూ..
ఇక భరణి దగ్గరికొచ్చి ఇమ్మానుయేల్ ఎమోషనల్ అవుతున్నాడని సుమన్ శెట్టి చెప్పాడు. ఏంటన్నా నా రీతూ నాకు సపోర్ట్ రావట్లేదు ఆడికి సపోర్ట్ వస్తుంది అంటున్నాడు.. అని సుమన్ శెట్టి చెప్పాడు. ఇక కామనర్ల దగ్గర కూర్చొని చేసిన ఘనకార్యాన్ని సపోర్ట్ చేసుకుంటూ రీతూ కామెంట్లు చేసింది. కాదు నేను క్లియర్‌గా స్టాప్ అన్న తర్వాత ఆపేయకపోతే తీసేస్తాను అని చెప్పా కదా.. స్టాప్ ఎందుకు చెప్పారని అడుగుతారేంటి నాకు అర్థం కాదు.. అంటూ రీతూ అంది. మరోవైపు సుమన్ శెట్టితో మాట్లాడుతూ ఇమ్మూ ఎమోషనల్ అయ్యాడు. ఫస్ట్ నుంచి రీతూ వాళ్లనే సపోర్ట్ చేస్తుందన్నా.. నా కోసం ఆడలేదన్నా.. అంటూ ఇమ్మూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఎంత టఫ్ ఇచ్చావో తెలుసా నీకు.. మాములు టఫ్ ఇవ్వలేదు నువ్వు.. అంటూ సుమన్ శెట్టి ఇమ్మూని ఓదార్చాడు.
సుమన్ శెట్టి ఆన్ ఫైర్..
ఇక మరో ప్రోమోలో ఈ వారం టెనెంట్స్‌లో నుంచి ఒకరికి ఓనర్‌గా మారి బిగ్‌బాస్ మెయిన్ హౌస్‌లో అడుగుపెట్టడానికి అవకాశం ఇస్తున్నాం.. అంటూ బిగ్‌బాస్ చెప్పాడు. ఓనర్స్ విసిరిన ఐటెమ్స్ పట్టుకొని ఎండ్ బజర్ మోగే వరకూ వాటిని తమ బాస్కెట్‌లో భద్రంగా దాచుకోవాలి.. అంటూ ఓ టాస్క్ పెట్టారు. ఇందులో టెనెంట్స్ అందరూ దాదాపు ఫిజికల్ ఫైట్ చేసుకున్నారు. ముందుగా ఫ్లోరా, సంజన ఈ టాస్కు నుంచి ఎలిమినేట్ అయ్యారు. తర్వాత వీళ్లిద్దరూ కలసి రీతూని అటాక్ చేస్తుంటే ఇమ్మూ ఇమ్మూ అంటే సాయం కోసం పిలిచింది రీతూ. ఆ తర్వాత సుమన్ శెట్టిని అటాక్ చేస్తుండగా అనుకోకుండా చేతితో కొట్టాడు సుమన్. ఇది ఫిజికల్ అటాక్ సుమన్ శెట్టి ఔట్ అంటూ సంచాలక్ ప్రియ ప్రకటించింది. దీంతో ఆ బుట్టని కాలితో తన్నేసి కోపంగా వెళ్లిపోయాడు సుమన్ శెట్టి.


