Bigg Boss Elimination: బిగ్ బాస్ లో ఎవరూ ఊహించని ట్విస్ట్ జరిగింది. హౌస్ నుంచి శనివారమే నిఖిల్ నాయర్ ఎలిమినేట్ అయ్యాడు. నిజానికి ఆదివారం నాడే ఎలిమినేషన్ ప్రక్రియ ఉంటుంది. కానీ శనివారం ఎపిసోడ్‌కి రాగానే నాగార్జున.. హౌస్‌మేట్స్‌కి షాకిస్తూ ఒక ప్రకటన చేశారు. ఈరోజు బిగ్‌బాస్ హౌస్ మీద రెండు బాంబ్స్ విసిరారు. అందులో ఒకటి డబుల్ ఎలిమినేషన్ అంటూ నాగ్ అనౌన్స్ చేశారు. అయితే, ఈ వారం ఏకంగా 10 మంది నామినేషన్స్‌లో ఉన్నారు. కేవలం ఇమ్మానుయేల్ మాత్రమే ఈ నామినేషన్స్‌లో లేడు. ఇక ఈ వారం కెప్టెన్ అయి ఇమ్యూనిటీ కూడా సాధించింది తనూజ. దీంతో వీళ్లు ఇద్దరూ మినహా మిగిలినవారందరినీ గార్డెన్ ఏరియాలో ఎలిమినేషన్ ప్రక్రియ కోసం నిల్చోబెట్టారు నాగార్జున. ఆ తర్వాత నిఖిల్ ఎలిమినేట్ అంటూ నాగ్ చెప్పుకొచ్చారు.
Read Also: Gujarat Titans: గుజరాత్ టీంలో ఏకంగా 9 మంది బై బై!
నిఖిల్ ఎలిమినేట్
ఇలా నిఖిల్ శనివారం ఎపిసోడ్‌లో ఎలిమినేట్ అయ్యాడు. అయితే ఆదివారం నాటి ఎపిసోడ్‌లో మరో ఎలిమినేషన్ జరగబోతుందని నాగ్ చెప్పేశారు. దీంతో, హౌస్ మేట్స్ సహా అందరూ షాక్ అయ్యారు. ఇక నిఖిల్ ఎలిమినేట్ కాగానే సంజన ఎమోషనల్ అయింది. కెప్టెన్సీ టాస్కులో నిఖిల్‌కి సంజన సపోర్ట్ చేయకుండా తనూజకి చేసింది. దీని వల్ల నిఖిల్ గేమ్ నుంచి ఔట్ అయ్యాడు. లేకపోతే కెప్టెన్ అయి ఇమ్యూనిటీ ద్వారా సేవ్ అయి ఉండేవాడని సంజన చెప్పి బాధపడింది.
Read Also: Team India: మీకు నచ్చితేనే సెలెక్ట్ చేస్తారా?
నిఖిల్ పై నాగ్ ప్రశంసలు..
ఎలిమినేట్ అయి స్టేజ్ మీదకి రాగానే నిఖిల్‌ని నాగ్ ప్రశంసించారు. ఈ వారం గేమ్ చాలా బాగా ఆడావ్ .. కింగ్ కూడా అయ్యావ్.. కానీ ఎలిమినేట్ అయ్యావ్ సరే నీ జర్నీ చూద్దాం అంటూ ఏవీ ప్లే చేశారు. ఆ తర్వాత హౌస్‌మేట్స్ అందరిలో నీకు నచ్చని విషయం గురించి చెప్పు అంటూ నాగ్ అడిగారు. దీంతో తనూజలో ఏడుపు, రీతూలో కన్ఫ్యూజన్, దివ్యలో ఓవర్ కమాండింగ్, భరణిలో సైలెన్స్ నచ్చవని నిఖిల్ చెప్పాడు.
ఆదివారం గౌరవ్ ఔట్
ఇక ఆల్రెడీ నాగ్ చెప్పాడు ఆదివారం మరో ఎలిమినేషన్ జరుగుతోందని. అయితే, ఈసారి మరో ఎలిమినేషన్ జరగబోతుంది. ఇందులో హౌస్ నుంచి గౌరవ్ ఎలిమినేట్ కాబోతున్నాడు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన షూటింగ్ పూర్తయింది. నిజానికి ఆట పరంగా చూస్తే హౌస్‌లో ఉన్నవారిలో నిఖిల్-గౌరవ్ ఇద్దరూ చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్. అయినా కానీ ఓటింగ్ పరంగా తక్కువ ఉన్నారంటూ వీరిని ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అంటూ పంపించేస్తున్నారు. అయితే, గౌరవ్-నిఖిల్ ఇద్దరూ ఔట్ అవ్వడంతో సీజన్-9లో మొత్తం వైల్డ్‌కార్డ్స్ అందరూ ఎలిమినేట్ అయిపోయినట్లే. మొత్తం ఆరుగుర్ని వైల్డ్‌కార్డ్స్‌గా హౌస్‌లోకి పంపారు. వీరిలో రమ్య, మాధురి, సాయి, అయేషా ఇప్పటికే ఎలిమినేట్ అయ్యారు. నిఖిల్ శనివారం ఎలిమినేట్ కాగా గౌరవ్ ఆదివారం ఎలిమినేట్ కాబోతున్నాడు.


