Monday, November 17, 2025
HomeTop StoriesBigg Boss Voting: ‘దమ్ము’ మిడ్ వీక్‌లోనే మాయమవుతోందా?.. ఈ వారం ఇద్దరు ఫిక్స్..!

Bigg Boss Voting: ‘దమ్ము’ మిడ్ వీక్‌లోనే మాయమవుతోందా?.. ఈ వారం ఇద్దరు ఫిక్స్..!

Bigg Boss Voting: బిగ్ బాస్ రసవత్తరంగా సాగుతోంది. నాలుగో వారం నామినేషన్స్‌లో మొత్తం ఆరుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు. దమ్ము శ్రీజ, దివ్య నిఖిత, రీతూ చౌదరి, ఫ్లోరా షైనీ, సంజనా, హరిత హరీష్ ఈ ఆరుగురు నామినేషన్స్‌లో ఉన్నారు. అయితే, వీళ్లలో రీతూ చౌదరికి ఓటింగ్‌తో సంబంధం లేదు. బిగ్ బాస్ ఎన్నాళ్లు ఆమెను ఉంచాలని అనుకుంటాడో అన్నాళ్ల వరకూ ఢోకా లేదు. బిగ్ బాస్ ఎలాంటి కంటెంట్ కావాలంటే దానికి ఆమె రెట్టింపు ఇస్తుంది కాబట్టి.. అలాంటి వాళ్లని బిగ్ బాస్ టచ్ చేయడు గాక చేయడు. అయితే, హౌస్ నుంచి మరో వికెట్ పడాలంటే శనివారం వస్తేనే కానీ.. ఎవరు ఎలిమినేట్ అవుతున్నారనేదానిపై క్లారిటీ వచ్చేది కాదు. కానీ ఈవారంలో ఎగ్జామ్ పేపర్ ముందే చేతికిచ్చి ఎగ్జామ్ రాయించినట్టుగా ఉంది పరిస్థితి. ఈవారం నామినేషన్స్‌లో ఉన్న ఆరుగుర్ని చూస్తే పడే వికెట్ ఎవరిదనేది ముందే ఫిక్స్ అయిపోవచ్చు. ఇప్పటి వరకూ బిగ్ బాస్ హౌస్ నుంచి మూడు వికెట్లు పడ్డాయి. తొలివారంలో శ్రష్టీ వర్మ, రెండోవారంలో మర్యాద మనీష్, మూడో వారంలో ప్రియశెట్టిలు ఎలిమినేట్ అయ్యారు. ఇక నాలుగో వారంలో ఆరుగురు కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు.

- Advertisement -

నామినేషన్స్ లో ఆరుగురు

అయితే, ఈ వారం రీతూ చౌదరి, ఫ్లోరా షైనీ, సంజనా, హరిత హరీష్, శ్రీజా దమ్ము, దివ్య నిఖిత.. ఈ ఆరుగురు నామినేషన్స్‌లో ఉన్నారు. అయితే తొలివారంలో ఫ్లోరా షైనీ నామినేషన్స్‌లో ఉంటే.. ఎలిమినేట్ అయ్యేది ఆమే అని అంతా అనుకున్నారు. కానీ.. మూడో వారానికి వచ్చేసరికి ఆమె టాప్ ఓటింగ్‌లో ఉంది. అంటే ఈమె గేమ్‌లో పుంజుకుని అద్భుతంగా రాణిస్తుందని కాదు.. మూడోవారంలో ప్రియశెట్టిని ఎలిమినేట్ చేయడం కోసం.. లీస్ట్ ఓటింగ్‌లో ఉన్న ఫ్లోరా షైనీకి ఓట్లు వేసి టాప్‌లో నిలబెట్టారు. ఆమె ఆటలో అయితే ఎలాంటి మార్పు లేదు. అక్కడ ప్రియశెట్టిపై ఉన్న కోపంతో ఫ్లోరా షైనీకి ఓట్లు గుద్దిపడేశారు. అయితే ఈవారంలో ఎలిమినేషన్ పిక్చర్ గతవారం కంటే క్లియర్‌గా కనిపిస్తుంది. మూడో వారంలో చూస్తే ప్రియశెట్టితో పాటు.. కళ్యాణ్ పడాల కూడా నామినేషన్‌లో ఉండటంతో బయటకు పోవడానికి ఇద్దరి మధ్య టఫ్ ఫైట్ నడిచింది. చివరికి ప్రియశెట్టినే ఎలిమినేట్ అయ్యింది. కాగా.. ప్రియశెట్టిని ఎలాగైతే నామినేషన్స్‌లోకి వస్తుందా? అని వెయిట్ చేశారో.. దమ్ము శ్రీజా కోసం కూడా ఆడియన్స్ అలాగే వెయిట్ చేశారు. గత వారం ఈమె నామినేషన్స్‌లోకి వచ్చింది కానీ.. ఢమాల్ పవన్ కెప్టెన్సీ పవర్‌తో సేవ్ చేయడంతో బతికిపోయింది. లేదంటే ప్రియశెట్టికంటే ముందే దమ్ము శ్రీజ ఎలిమినేట్ అయ్యేది. కానీ ఈ నాలుగో వారంలో దమ్ము శ్రీజ నామినేషన్స్ గండం నుంచి తప్పించుకోలేకపోయింది. దీంతో ఈవారంలో ఆమె ఎలిమినేట్ కావడం ఖాయంగా కనిపిస్తుంది.

Read Also: Bigg Boss Promo Today: కెప్టెన్సీ రేసులో ఆ నలుగురు.. అమ్మాయిల నుంచి రీతూ ఒక్కతే..!

ఎలిమేనేషన్ కోసం..

నాలుగోవారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారనే ఓ సర్వే నిర్వహించగా.. అందరూ దమ్ము శ్రీజకి ఓట్లు గుద్దిపారేస్తున్నారు. ఆమెకు దాదాపు 41 శాతం మంది ఎలిమినేట్ అవుతుందని ఓట్లు వేయగా.. రెండో స్థానంలో 19 శాతం ఓట్లతో హరిత హరీష్ ఉన్నాడు. 14 శాతం ఓట్లతో రీతూ చౌదరి మూడో స్థానంలో ఉంటే.. ఫ్లోరా షైనీ 10 శాతం ఓట్లతో నాలుగో స్థానంలో ఉంది. వైల్డ్ కార్డ్ ద్వారా వెళ్లిన దివ్య నిఖిత 8 శాతం శాతం ఓట్లతో ఐదో స్థానంలో ఉంటే.. సంజన 7 శాతం ఓట్లతో చివరి స్థానంలో నిలిచింది. సంజనాకి ఎక్కువ ఓట్లు పడుతున్నట్టు లెక్క. మొత్తంగా అతి తక్కువ ఓట్లు పడే వాళ్లే ఎలిమినేట్ అవుతారు కాబట్టి.. ఈవారం దమ్ము శ్రీజ ఎలిమినేషన్ గండం నుంచి గట్టెక్కడం కష్టమే. ఇంకా ఓటింగ్ రెండు రోజులు టైమ్ ఉంది కాబట్టి.. ఈ ఓటింగ్ లెక్కలు ఏమైనా మారతాయి అనుకోవడానికి కూడా ఛాన్స్ లేదు. అప్పటికప్పుడు ఫ్యాన్ బేస్ పెరిగిపోయి ఓట్లు గుద్దేయడానికి దమ్ము శ్రీజ.. దమ్మున్న సెలబ్రిటీ కూడా కాదు. కాబట్టి.. ప్రియశెట్టి బాటలోనే శ్రీజా కూడా ఇంటి ముఖం పట్టడం ఖాయమే. లేదూ.. ఈమెను ఉంచాలీ అని బిగ్ బాస్ జాలి తలస్తే మాత్రం.. ఫ్లోరా షైనీ ఎలిమినేట్ కావొచ్చు. ఎందుకంటే ఆమె ఈవారం కాకపోతే వచ్చేవారమైనా.. అదీ కాదంటే ఆ తరువాతి వారమైన ఎలిమినేట్ కావాల్సిందే కాబట్టి.. కంటెంట్ లెక్కల్లో శ్రీజను ఉంచాలనుకుంటే మాత్రం ఫ్లోరా షైనీ పంపొచ్చు. లేదూ ఓటింగ్ లెక్కల్లోనే అయితే దమ్ము శ్రీజ‌కి గుడ్ బై చెప్పేయాల్సిందే. అదీ కాదు.. వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉన్నాయి కాబట్టి డబుల్ ఎలిమినేషన్ చేసి పారేస్తే పోలా అనుకుంటే.. శ్రీజ, ఫ్లోరా షైనీ ఇద్దర్నీ ఏరేయొచ్చు.

Read Also: Bigg Boss Promo Today: నడుము గిల్లారని ఫీలైన ఇమ్మూ.. ప్రూఫ్ ఉందా అని ప్రశ్నించి తనూజ

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad