Bigg Boss New Promo: బిగ్ బాస్ ఆట అంటేనే ఇన్ ప్రెడిక్టబుల్. గేమ్ ఎప్పుడు, ఎలా మారుతుందో ఎవరికీ తెలియదు. అయితే, ఈ సీజన్ ప్రారంభానికి ముందు హౌస్‌లోకి వెళ్తున్న సామాన్యులు గెలవాలని అంతా అనుకున్నారు. కానీ సీజన్ ప్రారంభమైన తరువాత హౌస్‌లో ఉన్న కామనర్స్‌ని ఎత్తి బయటపడేయండి మహా ప్రభో అని తెగ మొక్కుతున్నారు ఆడియన్స్ అంత చిరాకు తెప్పిస్తారు కామనర్స్. బిగ్ బాస్‌కి బుద్ది తక్కువై వాళ్లని ఓనర్స్‌ని చేసినందుకు..వాడి చెప్పుతో వాడ్నే కొట్టుకునేట్టు చేస్తున్నారు. వాళ్లు నిజంగా ఓనర్స్‌గా ఫీల్ అయిపోతూ.. సెలబ్రిటీలకు చుక్కలు చూపిస్తున్నారు. వాళ్లని బిగ్ బాస్ హౌస్‌కి ఓనర్‌గా ఉండమంటే.. వీళ్లు మాత్రం.. ఏకంగా నాగార్జున అన్నపూర్ణ స్టుడియోకే ఓనర్లుగా ఫీల్ అయిపోతున్నారు. ఇక, ఇలా అయితే, కుదరదని.. నాగార్జున వాళ్లకు గట్టిగా క్లాస్ పీకారు. ఇక నుంచి ఓనర్స్ టెనెంట్స్ అవుతారని.. టెనెంట్స్‌గా ఉన్నవాళ్లు ఓనర్స్ అవుతారంటూ దిమ్మతిరిగే జలక్ ఇచ్చారు. ముఖ్యంగా ఆ ప్రియశెట్టి, దమ్ము శ్రీజలను చూస్తుంటే చిరాకేస్తుంది. ఆ ప్రియ గొంతు, మూతి తిప్పుడు చూస్తుంటే చిరాకు దొబ్బుతుంది జనాలకి. అయితే ఈ చిరాకు కేవలం చూసేవాళ్లకే కాదు.. బిగ్ బాస్ హోస్ట్‌కి కూడా.
Read Also: Bigg Boss Promo Today: బిగ్ బాస్ చరిత్రలోనే తొలిసారిగా.. పవన్ కెప్టెన్సీ ఖతం.. రీతూకి వాయింపుడే..
ప్రియ ఓవరాక్షన్..
కాగా.. ప్రియ, శ్రీజ ఓవరాక్షన్ చూసి చూసీ ఇద్దరికీ ఇచ్చిపడేశారు నాగార్జున. వీళ్లిద్దరితో పాటు గుండు అంకుల్ హరిత హరీష్‌కి కూడా ఇచ్చిపాడేశఆరు.. ఉంటావా పోతావా? అని సూటిగా అడిగారు. బిగ్ బాస్ దమ్ము గురించి ప్రశ్నించావ్ కదా.. అందరి ముందు అడుగుతున్నా.. హౌస్‌లో ఉంటావా? పోతావా? అని హరిత హరీష్‌ని అడిగారు నాగార్జున. దాంతో మనోడు ఎప్పటిలాగే.. ‘అబ్బే నేను అలా అనలేదు.. దమ్ము శ్రీజని అన్నాను.. బిగ్ బాస్‌ని అనలేదు అంటూ ఫ్లిప్ చేశాడు. దాంతో శ్రీజ లేచి.. లేదు సార్.. అతను బిగ్ బాస్‌నే అన్నాడు అని చెప్పింది. ఇంకేముందు ఎప్పటిలాగే తెల్లమొహం వేశాడు మాస్క్ మెన్. ఆ తర్వాత సోది బ్యాచ్ ప్రియశెట్టి, శ్రీజలను వాయించిపారేశారు. ముఖ్యంగా ఆ బొంగురు గొంతు ఇరిటేషన్ ప్రియని.. ‘నువ్వు ఎంతసేపూ అవతల వాళ్ల తప్పుల్ని వెతకడం తప్ప వేరే పని లేదా? ప్రియ, శ్రీజల గురించి ఒక్కటే చెప్తున్నా.. ఎంతసేపూ థూ థూ థూ అనడమేనా? ఒక్కరు మాట్లాడండి అంటూ ఇచ్చిపడేశారు. నాగార్జున మాటకి ఆడియన్స్ నుంచి చప్పట్ల మోత మోగింది.
Read Also: Gen Z: నిద్రకు దూరమవుతున్న జెన్ జెడ్.. కారణాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!


