Monday, November 17, 2025
HomeTop StoriesAmardeep: రేయ్ ఏందిరా ఇవన్నీ.. బెడ్రూమా.. పండ్లతోటనా?

Amardeep: రేయ్ ఏందిరా ఇవన్నీ.. బెడ్రూమా.. పండ్లతోటనా?

Amardeep: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 లో వైల్డ్ కార్డు కంటెస్టెంట్ గా అమర్ దీప్ ఎంటరవుతాడని సోషల్ మీడియాలో తీవ్ర ప్రచారం జరిగింది. అయితే, అనుకున్నట్లుగానే బిగ్ బాస్ సీజన్-7 కంటెస్టెంట్స్ అమర్ దీప్ చౌదరి-అర్జున్ అంబటి హౌస్‌లోకి అడుగుపెట్టారు. పోలీస్ గెటప్స్‌లో మెయిన్ డోర్ నుంచి వచ్చిన అమర్-అర్జున్‌ని చూడగానే సార్ నమస్తే సార్.. అంటూ ఇమ్మూ పలకరించాడు. రీతూ అయితే తన ఫ్రెండ్ అయిన అమర్‌ని గట్టిగా పట్టేసుకొని ఎగిరి గంతేసింది. అందరికీ మై సెల్ఫ్ ఇంద్రజిత్ ఫ్రమ్ సీజన్ 7.. అని అర్జున్.. ఐయామ్ కామ్‌జీత్ ఫ్రమ్ సీజన్-7.. అంటూ అమర్ పరిచయం చేసుకున్నారు. కామ్‌జీత్ అంటే కామ్‌గా ఉంటారా.. అంటూ రీతూ పంచ్ వేసింది. అందరూ లైన్‌లో నిల్చోగా ఏంటి ఇంతే ఉన్నారు.. ఇంకా ఉంటారు కదా.. అని అమర్-అర్జున్ అడిగారు.

- Advertisement -

Read Also: Bigg Boss Updates: మరోసారి మాధురిదే గెలుపు.. జేజేలు పట్టిన సంజన టీమ్

మేం రావడానికి కారణం..

మేము వచ్చిన మెయిన్ రీజన్ ఇద్దరు డాన్స్‌ని పట్టుకోవడానికి వచ్చాం.. సంజన సైలెన్సర్, మాస్ మాధురి.. అని అర్జున్ అన్నాడు. అయితే వీళ్ల రాక చూసి సంజన-మాధురి లోపల దాక్కున్నారు. వాళ్లు లేరు కద సార్.. అని ఇమ్మూ అనగానే వాళ్లిద్దరూ ఏమన్నా డబ్బాలా స్పూన్‌లారా ఎక్కడైనా దాక్కుంటే కనబడకుండా ఉండటానికి.. అంటూ అర్జున్ పంచ్ వేశాడు. ఇలా కాదని మొత్తం హౌస్ అంతా తిరుగుతూ అమర్-అర్జున్ సెర్చ్ చేశారు. ఎవరైనా ఏమైనా కొట్టేశారా.. అని అడిగితే మేము ఏం కొట్టేయలేదు సార్.. అంటూ ఇమ్మూ అతి వినయంగా చెప్పాడు. దీంతో హౌస్‌లో ఏం కొట్టేశారో మాకు తెలుసు సార్.. అవి తీసుకొస్తే మీరు ఉంటారు సార్ లేకపోతే మాతో పాటే మెయిన్ డోర్ నుంచి బయటికి వస్తారు సార్.. అంటూ అమర్ వెటకారం ఆడాడు.

Read Also: Bigg Boss Ayesha: బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకొచ్చేసిన అయేషా.. ఔటన్నట్లేనా?

కిచెన్ సామాన్లన్నీ కొట్టేశారు

మీరు చెప్పట్లేదు కాబట్టి.. అని బెడ్ రూమ్ డోర్‌కి లాఠీ అడ్డం పెట్టేసి లోపల దూరి మొత్తం హౌస్‌మేట్స్ కబోర్డ్స్, మంచాల కబోర్డ్స్ అన్నీ వెతికాడు అమర్. ఒక్కొక్కరి బెడ్ దగ్గర చాక్లెట్లు, పళ్లు ఫలహారాలు ఇవన్నీ చూసి అవాక్కయ్యాడు అమర్. వామ్మో రేయ్ ఏంట్రా కిచెన్‌లో ఉండాల్సిన ఎగ్‌ట్రేలు అన్నీ ఈడ పెట్టారు.. అయ్యబాబోయ్.. అంటూ మొత్తం తీసి బయట పెట్టాడు అమర్. తనూజ బెడ్ దగ్గర అయితే ఏంట్రా ఇది పళ్లతోటా.. లేకపోతే బెడ్‌రూమా.. ఈడ ఏకంగా మార్కెట్‌యే ఉంది.. ఏంట్రా ఇయ్యి.. ఏంట్రా మీరు.. అంటూ అమర్ కామెడీ చేశాడు. ఇలా ఇద్దరూ కలిసి ఆడియన్స్‌కి ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. మరోవైపు హౌస్ నుంచి రాముని మిడ్ వీక్ ఎలిమినేషన్ చేస్తున్నామంటూ అందరికీ షాక్ కూడా ఇచ్చారట. అయితే ఇది సరదాగా చేసిన పనే తర్వాత కాసేపటికి పంపిచేశారని టాక్. మరి ఆ వివరాలు చూడాలంటే ఇవాళ్టి ఎపిసోడ్ చూడాల్సిందే.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad